పిల్లల ప్రవర్తన;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నలుగురు పిల్లలు కలిసి  హాయిగా ఆటపాటలలో వుంటే  వారికి ఆకలిగాని, దప్పిక  కానీ జ్ఞాపకానికి రావు  ఆట గెలవాలనే  పట్టుదల  ఎదుటివారి  ముందు ఓడిపోకూడదనే లక్ష్యం  వాళ్లను ఆలోచింపనియ్యడు  ఆ సమయంలో అమ్మ కలుగజేసుకొని  ఏ సమయానికి ఏది నిర్ణయించాలో అది ఇచ్చి  వాడు వద్దన్నా లాలించి వారితో  నీళ్లు తాగించడం ఏదైనా తినిపించడం చేస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది  తల్లి కూడా నిర్లక్ష్యం చేస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి?  సామాన్యంగా ఆ వయసులో లో ఎవరు ఆలోచించారు కానీ పిల్లల ఆరోగ్యమే తన ఆరోగ్యంగా భావించే కన్నతల్లి మనసు ఊరుకుంటుందా? బిడ్డకు ఆకలైతే తనకే ఆకలి అయినట్లుగా భావిస్తుంది.  అలాంటి తల్లి సంరక్షణలో బ్రతికిన బిడ్డ  ఆలోచించవలసిన అవసరం వుండదు. నాన్నా ఇంకా ఆకలి అవ్వడం లేదా అంటే  అవుతుందమ్మా అప్పుడు అక్కడ వున్న శేఖర్ వాడు తినలేదు కదా నేను తింటే బాగుండదు కదా అని  రాలేకపోయాను అంటాడు. వాడి మాయ మాటలు కన్న తల్లికి తెలియకుండా పోతాయా  అలాంటి వాటిని ఆస్వాదిస్తూ అమ్మ  వాడికి  ఆరోగ్యాన్ని గురించి విశేషాలు చెప్పాలి  చూడామ్మా నువ్వు అన్నం తినకపోతే  ఎంత నీరసం వస్తుంది  కళ్ళు తిరిగి పడిపోతే నువ్వు ఏమైపోతావు  మళ్లీ రేపు ఒకసారి ఆడుకోవద్దా  అలా ఆడుకోవాలంటే నీకేం కావాలి  సమయానికి భోజనం చేయాలి  భోజనం కూడా సరిపోయినట్టుగా తినాలి  ఆకలి అవ్వడం లేదమ్మా అని వంకలు చెప్పకూడదు. అలా చేస్తే ఎవరికి నష్టం  నువ్వు తినకపోతే నాకు ఆకలి అవుతుందా? అన్న పద్ధతులు  జీవితం మీద ఆశ పుట్టించేలా మాటలు చెప్పాలి దానివల్ల ఆప్యాయతలు పెరుగుతాయి బిడ్డ ఆరోగ్యం చాలా బాగుంటుంది. తల్లి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే  బంధువుల గురించీ వారికీ మనకు సంబంధం ఎలాంటిదో  వివరాలన్నీ పిల్లలకు చెప్పాలి  లేకపోతే వారు ఎవరైనా వచ్చినప్పుడు  మీరెవరు అని అడిగితే వారికి మనకు కూడా బాగుండదు. వారి మనస్తత్వాలను కూడా తెలియజేస్తే వారితో ఎలా ప్రవర్తించ వలసినది చెప్పి ఉంచడం వల్ల వచ్చేవారిలో ఎవరికి కోపం ఉంటుందో ఎవరూ శాంతంగా ఉంటారో ఎవరు చక్కగా మాట్లాడుతారో  ఈ కుర్రాడికి అర్థం కాదు కదా  అందువల్ల చాలా సున్నితంగా మాట్లాడే ఏర్పాటు శిక్షణ ఇచ్చినప్పుడు  ఆ వచ్చినవారు ఆనందిస్తారు మనకు  గౌరవం లభిస్తుంది. పిల్లల్ని వాళ్ల అమ్మ చాలా బాగా పెంచుతుంది  మన సంప్రదాయాన్ని నిలబెడుతుంది అని ఎంతో ఆనందిస్తారు. వారి ఆనందం కన్నా  మన బిడ్డల క్రమశిక్షణ మనకు ముఖ్యం కనక  అమ్మకు మరో బాధ్యత  ఇది.  దీనిని తప్పకుండా పాటిస్తే  కుటుంబానికి మంచి పేరు వస్తుందని నా నమ్మకం.కామెంట్‌లు