జగతికి వెన్నెముక స్త్రీ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రపంచ దేశాలలో ఏ దేశాన్ని పరిశీలించినా భిన్నత్వంలో ఏకత్వం స్పష్టంగా కనిపిస్తుంది.  ప్రతిచోటా మంచీ చెడూ ఉంటుంది  అది వ్యక్తుల చేతుల్లో ఉంటుంది మంచిగా ఆలోచించిన వాడు మంచిని చేయగా చెడును గురించి ఆలోచించే వాడు చెడ్డ పనులు చేయడం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం  ప్రకృతిలో కూడా భిన్న భిన్న తత్వాలు... ఒక చోట వర్షం  విపరీతంగా ఉంటుంది  మరొకచోట వేడిని తట్టుకోలేమ్ ఇంకొక చోట చలి కోసం ఒక రగ్గు పెట్టుకోవాల్సినదే పశుపక్ష్యాదులలో కూడా  అన్ని విభాగాలలోనూ స్త్రీలు వేరు పురుషులు వేరు అది మానవ ప్రకృతి కూడా. జ్ఞానం కాదు. పిల్లల మనస్తత్వంలో విభిన్న ఆకారాలతో రెండు రకాల ప్రాణుల్ని  మనం చూస్తూ ఉంటాం  ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న వివాదం కనిపించదు  ఎవరి గొప్ప వారిదే ఎవరి ఆలోచనలను బట్టి చేసే పనులను బట్టి సమాజం నిర్ణయిస్తుంది వారి తత్వాలు.
మానవ జీవిత ప్రగతి  ప్రకృతి చేతిలో ఉంది  ప్రకృతి చేతిలో మనమంతా ఆటబొమ్మలం  నవ్వించిన వాడిన ఏడిపిస్తుంది ఏడిపించే వాడివి నవ్విస్తుంది బాధలు పడ్డవాడితో కష్టాలనుండి సుఖాలు అనుభవించేలా చేస్తోంది తల ఎత్తుకు జీవించే వాడిని తలదించుకునేలా చేస్తుంది  తలదించుకుని  జీవిస్తున్న వాడిని తలెత్తుకునేలా చేస్తోంది ఇది ప్రకృతి లీల. భగవంతుని మనం అంటూ ఉంటాం లీలా మానుష విగ్రహుడు అని మనిషి రూపంలో ఉన్న బ్రహ్మస్వరూపం  అతని వేషాలను చూసి ఏమీ  చెప్పలేం. చేసే పనికి అతని ఆలోచనలకు సంబంధం ఉండదు. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ  పాతను రోతగా భావించి కొత్తను వింతగా భావిస్తూ  ఆ కొత్తదనాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి.  ఇది కూడా ప్రకృతి లీలలో భాగమే. శరీరానికి కప్పుకున్న స్త్రీ పురుష భేదం ఒకసారి చూద్దాం. స్త్రీ శిశు జన్మించినప్పుడు తనను ఆడబిడ్డ అంటాం. దానికి పెద్దలు చేసే వ్యాఖ్యానం  పెరిగిన తరువాత పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేది, పుట్టింటిని వదిలి పెట్టేది అని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. మరి మగ శిశువు  ఇక్కడే స్థిరంగా ఉంటుందా మరి ఎప్పటి దాకా వుంటుంది అని ఆలోచించినప్పుడు  ఇహపరాలు మనకు గుర్తొస్తాయి. పుట్టిన ప్రతి శిశువు మరణించి తీరవలసినదే ఈ భూమి మీద పుట్టిన శరీరం ఆకారాన్ని కలిగి దానిలో జీవాన్ని నింపి దానికి ఎంత ఆయుషు వున్నదో అంతవరకు సక్రమంగా తన పనులు చేసుకుంటూ  ఆయుష్షు తీరగానే మనకు తెలియని అది నరకం కావచ్చు స్వర్గం కావచ్చు మరేదైనా కావచ్చు ఈ శరీరాన్ని వదిలిపెట్టడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పుట్టిన ఏ బిడ్డ ఇక్కడిది కాదు అక్కడిదే అన్న అర్థంలోనే  ఆడబిడ్డ అని పిలుస్తారు.


కామెంట్‌లు