ప్రస్తుత కర్తవ్యం;-డా. నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రతి తల్లి బిడ్డకు శుచి శుభ్రాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ఆ కుర్రవాడు కూడా చక్కగా అమ్మ చెప్పినట్టుగానే చేయడానికి ప్రయత్నం చేస్తాడు స్నానం  చేసి వచ్చి కూర్చుంటాడు  ఆ సమయంలో అమ్మ  ఫలహారాన్ని తీసుకొచ్చి తినమంటుంది. అప్పటికి ఈ కుర్రవాడు  తన సెల్లుతో ఆడుకోవాలని  పుస్తకాలు తిరగ వేయడానికి కానీ, పత్రికలలో బొమ్మలు చూస్తూ ఉంటాము కానీ చేస్తూ  చేతినిండా మురికి చేసుకుని ఉంటాడు. దానిని అమ్మ గమనించదు కుర్రాడు స్నానం చేశాడు కదా అని పదార్థాలన్నీ అవగా తినేస్తాడు. తరువాత జరిగేది ఏమిటి  అనారోగ్యం  అమ్మ కడుపునొప్పి, అమ్మ తల్లి అంటే దాన్ని చూసి భరించలేక మా ఆసుపత్రి చుట్టూ తిరగడం ఈ లోపే మ్మ పూర్తి జాగ్రత్తలు తీసుకొని వుంటే తినే ముందు మళ్ళీ చేతులు కడుక్కోవాలి అని అమ్మ  చెపితే ఇలాంటి విపత్తులు రావు కదా.ఇవాళ  చాలామంది  చాలా పాత విషయాలను జ్ఞాపకం చేసుకొని  ఆ రోజుల్లో ఇలా చేశాం. ఉమ్మడి కుటుంబం గా ఉన్న సమయంలో  గ్రామం మొత్తం ఉమ్మడిగా ఉండేది  ప్రతి ఒక్కరిని  ప్రతి ఒక్కరూ  వరసలు పెట్టి పిలవడం  ఆప్యాయతలతో ఆనందంగా గడపడం  జ్ఞాపకం చేసుకొని ఎంతో బాధపడుతూ ఉంటారు.  ఏదైనా ఉత్సవం జరిగిన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా  ఆ గ్రామ వాసులంతా వెళ్లి  ఆ ఆనందాన్ని తమ ఇంట్లోనే జరిగినట్లుగా భావించి ఎంతో సంబరానికి గురి అవుతూ ఉంటారు. వారంతా అక్కడ గుమ్మి గూడి ఉన్న సమయంలో  వారి వారి బాగోవులను గురించి  క్షేమ సమాచారాలను గురించి  చెప్పుకుంటూ ఆ ఇంట్లో ఉన్న పసివాడి పేర్లతో కూడా  జ్ఞాపకం చేసుకొని ఆనందిస్తూ ఉంటారు.
అలాగే ఏదైనా విషాద సంఘటన ఏ కుటుంబంలో నా జరిగితే  ప్రతి ఒక్కరూ వెళ్లి పరామర్శించి అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి వాడే చేసుకుంటారు. గతాని గురించి బాధపడడం కన్నా  ఈరోజు మనం చేయవలసినది ఏమిటి  ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కుటుంబం మొత్తం వారికి ఎదురుగా కూర్చుని  వారి అందరి క్షేమ సమాచారాలను అడుగుతూ ఉంటే  చంటి పిల్లలు ఉంటే వారిని దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూ ఉంటే  దానిని చూసిన మన ఇంట్లో చిన్న పిల్లలు  పెద్దలు లేనప్పుడు ఎవరైనా బంధువులు వస్తే  తల్లిదండ్రులు ప్రవర్తించినట్లు ప్రవర్తించరా? ఏదైనా  సంప్రదాయం కానీ, సంస్కారం కానీ  మనకు వచ్చే పండుగలు  గురించి మనం ఏది చేస్తే పిల్లలు దానిని అనుసరించరా? ముందు మనం చేయకుండా ఏదో జరిగిందని బాధపడడం ఎంతవరకు సమంజసం సమంజసం ముందు నిన్ను నీవు సరి చేసుకుంటే సమాజం దానంతట అదే బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం మీరు కూడా ఆమోదించి ఆచరిస్తారని కోరుకుంటున్నాను.... ఆచరిస్తారు కదూ...


కామెంట్‌లు