పరిష్కారం;--పి.రమాదేవి.గొరిగనూరు.6వ తరగతి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల.-- జమ్మలమడుగుమండలం.కడపజిల్లా
 నరేష్ ఆరవ తరగతి చదువుతున్నాడు. తెలివైనవాడు.చదువులో,ఆటపాటల్లో నరేష్ దే ప్రథమస్థానం.  విద్యార్థుల నాయకుడుకూడా.
ఒకరోజు రోజా,సంగీత వాదించుకుంటూ నరేష్ కంటపడ్డారు. "ఎందుకు వాదులాడు కుంటున్నారు?"అనిఅడిగాడు.
."నా పెన్సిలు బడిలో ఎక్కడో పడిపోయింది.‌అది సంగీత వద్ద ఉంది.ఇవ్వమని‌ అడిగితే ఆ పెన్సిలు‌ తనదని ఇవ్వనంటోంది"చెప్పింది రోజా.
"సంగీత వద్ద ఉన్న పెన్సిలు నీది అంటున్నావు.నీ పెన్సిల్లా కనిపించినంత మాత్రాన నీదని చెప్పలేము కదా! ఏదయినా గుర్తు చెప్పు" అన్నాడు నరేష్.
 "నా పెన్సిలును గుర్తు కోసమని కింది భాగంలో కొరికి ఉంచుకున్నాను" చెప్పింది రోజా.
రాజేష్ పెన్సిలును సంగీత చేతిలో నుండి తీసుకుని చూశాడు.పెన్సిలు చివరన కొరికిన గుర్తు ఉంది.
"సంగీతా!ఈ పెన్సిలు రోజాదే. నీది కాదు. నీ పెన్సిలు ఎక్కడో పడిపోయి ఉంటుంది. వెదుక్కో.కనిపించకుంటే నా దగ్గరున్న రెండు పెన్సిల్లలో ఒకటి నీకు ఇస్తానులే" అని చెప్పి పెన్సిల్ ను రోజాకిచ్చాడు.
సమస్య సులభంగా పరిష్కారమవడం తో
అందరూ సంతోషించారు.

                   

కామెంట్‌లు