గృహిణిని గురించి మన పెద్దవారు ఒకే ఒక వాక్యంలో ఇంటిని చూడు, ఇల్లాలిని చూడు అన్న దానిని నానుడిగా చేశారు. ఆ ఇంటి కోడలిగా కొత్తగా వచ్చిన అమ్మాయిని చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. అయినా చూడవలసినది ఆమెను కాదు ఆమె సౌందర్యాన్ని కాదు ఆమె అందచందాలను కాదు ఆమె తెచ్చిన కట్న కానుకలు కాదు ముందు ఇల్లు చూడండి ఏ వస్తువు ఎక్కడ అమర్చాలో అక్కడ నచ్చిందా లేదా చిన్న చిన్న వస్తువులు ఎక్కడ ఏది ఉండాలో అక్కడ మీకు కనిపిస్తున్నాయా లేదా అలంకరణలు కూడా ఆ గదికి అందాన్ని పెంచుతున్నాయా లేవా అవి ఇవి అవసరమైనవి, అనవసరమైనవి అన్నీ పెట్టి ఆ గదిని చిందరగా వుంచిందా అన్న దృష్టితో ఒకసారి చూస్తే ఆమె ఎవరో మీకు తెలుస్తుంది ఎంత పొందికగా ఉంటుందో ఎంత సనాతన ధర్మాన్ని అనుసరిస్తుందో అర్థమవుతుంది.
పెళ్లయిన తర్వాత పిల్లను అత్తారింటికి పంపించేటప్పుడు తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఆమెను బయటకు పంపిస్తున్నాము అన్న బాధలోనే ఉంటారు. కొంతమంది స్త్రీలు కౌగలించుకొని దుఃఖిస్తారు కూడా. ఆ పిల్లను కౌగిలించుకుని తన ప్రేమను చూపుతూ కన్నీరు కారుస్తారు. అప్పుడు తల్లి తండ్రి అమ్మా నీవు కొత్త కాపురానికి వెళుతున్నావు. నీకు తెలిసిన వారు ఒక్కరు కూడా అక్కడ ఉండరు ప్రతి విషయము నీవు చక్కగా అవగాహన చేసుకుని పుట్టినింటికి ఏ విధమైన మచ్చ లేకుండా అత్తారింటి ప్రతిష్టను ఇనుముడింప చేయడం కోసం నిన్ను వారి ఇంటి కోడలుగా స్వీకరిస్తున్నారమ్మా ఆ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత నీ భుజాల మీద పెట్టి పంపిస్తున్నాము. ఏ చిన్న పొరపాటు చేసినా అది మీ అమ్మ పెంపకం ఇలాగా అని నన్ను అంటారు తల్లి అని కంటనీరు పెట్టుకుంటుంది మాతృమూర్తి కనుక.
పుట్టింట్లో అందరివందసెలవు తీసుకొని అత్తారింట్లో అడుగు పెడుతుంది నూతన వధువు. తన ఇంటిపేరు, గోత్రం పేరు, తన చిన్ననాటి ముచ్చటల నన్నిటిని ఆ గుమ్మం బయట వదిలి లోపల అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంటిపేరు ఆమెదే అవుతుంది. గోత్రనామం దగ్గరి నుంచి ప్రతి విషయం వీరికి సంబంధించిందే తప్ప పుట్టింటికి సంబంధించింది కాదు. ఈ ఇంటి వంశాన్ని వృద్ధి చేయడం కోసం పిల్లలను కని పెంచి పెద్దవారిని చేసి వారి కోసం తపన పడుతుంది తప్ప పుట్టింటి ఊసులు ఏ ఒక్కటి ఇక్కడ చెప్పిన పాపాన పోదు. దానిని స్వార్ధము అందమా త్యాగము అందమా. త్యాగశీలివమ్మా అని సీనియర్ సముద్రాల వారు ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని అలా సంబోధించారు అనుకుందామా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి