అమ్మ ఒడి... కేసీఆర్ కిట్ ;- ప్రమోద్ ఆవంచ 7013272452 అవును, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి.గైనకాలిస్టులు,జనరల్
సర్జన్ లు,అనస్థటిస్ట్ లు,పిడియాట్రీషియన్లు,అందరూ చాలా బిజీగా ఉంటున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు రెండు మూడు సిజేరియన్లు,మరో రెండు మూడు నార్మల్ డెలివరీలు అవుతున్నాయి.ప్రభుత్వ డాక్టర్లు,ప్రైవేట్ ప్రాక్టీసు చేయకుండా అడ్డుకునేందుకు
నానా ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం.కానీ ఆ ప్రయత్నాలు విఫలమైయ్యాయి.చాలా ఊర్లల్లో ప్రెగ్నెన్సీ కన్సీవ్
అయినప్పటి నుంచి, చివరి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుని, ప్రైవేటు ఆసుపత్రికి 
డెలివరీ కోసం వెళుతున్నారు.అంటే ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకపోవడమే అని రుజువు అవుతుంది.ప్రభుత్వ ఆ‌సుపత్రులలో,కనీస సదుపాయాలు, సౌకర్యాలు కూడా ఉండవనీ,ప్రజలు 
నిర్దారించుకున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో లేవనేది నిజం.ఒకవేళ ఉన్నా వాటిని ఉపయోగించడానికి ట్రైనింగ్ పొందిన డాక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ లేకపోవడం గమనార్హం.
                    పాపం ఆశా వర్కర్లు,ఏఎన్ఎమ్ లు, ఇంటింటికీ తిరిగి గర్భిణీ స్త్రీలు తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలని,ఎంత చెప్పినా వచ్చేవాళ్ళు కాదు.ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే వెళ్ళేవారు..... ఇక్కడ కట్ చేస్తే...
                    ఇప్పుడు పరిస్థితి మారింది.కేసీఆర్ ప్రభుత్వం,ప్రారంభించిన ఒక వినూత్న పథకం గర్భిణీ స్త్రీలను,వారి కుటుంబాలను విశేషంగా ఆకట్టుకుంది.
అదే 'కేసీఆర్ కిట్,అమ్మ ఒడి'..అదే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిటకిటలాడేందుకు దోహదపడుతుంది.
పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో విజయవంతమైన
ఈ పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రారంభించారనీ
అందరి అభిప్రాయం.ఒక మంచి పథకాన్నీ,మన అందరం స్వాగతించాల్సిందే.అసలు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకం గురించి,ఆ పథకం సక్సెస్ కావడానికి కారణాలు
సవివరంగా తెలుసుకుందాం.
                మామూలుగా కన్సీవ్ అయిన ఏ మహిళ అయినా పన్నెండు వారాల లోపు తమ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.ఆ తరువాత స్థానిక మెడికల్ ఆఫీసర్ తో కనీసం రెండు అంటీ నటల్ పరీక్షలు చేయించుకోవాలి.డాక్టర్ గారు రాసిన ఐరన్ ఫోలిక్ ఆసిడ్, కాల్షియం, ఒక అల్బేండజోల్, టాబ్లెట్స్ వాడాలి.అంతే కాకుండా టీటీ ఇంజక్షన్లు, తీసుకోవాలి.ఇది చేస్తే ఫస్ట్ వాయిదాగా ఆ గృహిణి బ్యాంకు అకౌంట్ లోకి మూడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది.
                ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే, కూతురు పుడితే అయిదు వేల రూపాయలు,
కొడుకు పుడితే నాలుగు వేల రూపాయలు ఇవ్వడమే
కాకుండా,బీసిజి, ఓరల్ పోలియో వ్యాక్సిన్,పుట్టగానే ఇచ్చే హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా ఇస్తారు.ఇది పిల్లో,పిలగాడో పుట్టిన తర్వాత,అంటే తొమ్మిది నెలల తరువాత అని అర్థం.అప్పుడే తల్లికి రెండు వేల రూపాయల విలువ గల కేసీఆర్ కిట్ కూడా ఇస్తారు.ఆ కిట్టులో పిల్లాడిని సంబంధించిన బట్టలు, పౌడరు, పుట్టిన పిల్లలకు చెందిన ఇతర వస్తువులతో కూడినదే అది.
                  ఇక పిల్ల, పిల్లవాడు పుట్టిన మూడున్నర నెలల లోపు ఓరల్ పోలియో వ్యాక్సిన్లు ఒకటి, రెండు, మూడు ఇవ్వడంతో పాటు ఇంజక్షన్ల రూపంలో పోలియో చుక్కలు, ఒకటి రెండు ఇవ్వడం జరుగుతుంది.అంతే కాకుండా పెంటావలెంట్ అనే వ్యాక్సిన్ ఒకటి రెండు మూడు డోసులు ఇచ్చిన వెంటనే తల్లి ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అవుతాయి.ఈ ప్రక్రియ పన్నెండున్నర నెలల వ్యవధిలో జరుగుతుంది.పిల్లా, పిలగాడికి, పద్దెనిమిది నెలల తరువాత తొమ్మిది నెలల వయసులో,విధిగా మిజిల్స్ వ్యాక్సిన్, విటమిన్ ఎ,జేయి మొదటి డోసు వ్యాక్సిన్లు వేయిస్తే మళ్ళీ తల్లి అకౌంట్ లో మూడు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది.ఇలా పుట్టిన పిల్లా... పిల్లాడిని తల్లి కడుపులో పడినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పుట్టిన తర్వాత ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు పద్దతి ప్రకారం రెగ్యులర్
 ఇంటర్వెల్స్ లో ఇచ్చి కాపాడడంలో ప్రభుత్వ సంకల్పం అమ్మ ఒడి పథకం ద్వారా నెరవేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.నిజంగా ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలు లబ్ది పొందాలని అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
               ఆడపిల్ల లక్ష్మి తో సమానం.అలాంటి లక్ష్మి కడుపులో పడినప్పటి నుంచి తల్లికి ప్రభుత్వం తరపున
ఆర్థిక సహాయం అందడంతో, ఆడపిల్లను కంటే ఇంటికి రావద్దనే భర్తల నోర్లు మూతపడ్డాయి.ఆ తల్లి కూడా నేను ఆడపిల్లను కన్నాను అయితే ఏమిటన్న ధైర్యం 
కళ్ళల్లో మెరుపై మెరుస్తుంది.ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీకి లక్షల్లో అయ్యో ఖర్చు భారాన్ని తగ్గించి, వాయిదా పద్దతుల్లో వారి ఖాతాల్లోనే డబ్బులు పంపించే, ఈ కేసీఆర్ కిట్ పథకం ప్రభుత్వంపై  అధిక భారంగానే భావించవచ్చు.
అయినా గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం, వారిని ఆదుకునే
లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.రోజూ  జిల్లా మెడికల్ ఆఫీసర్లు,హాస్పిటల్స్ సూపరింటెండెంట్లతో,ఫిజికల్ మీటింగ్స్,ఆరోగ్య శాఖామంత్రి హరీశ్ రావుతో,జూమ్ మీటింగులు నిర్వహిస్తూ అటు డాక్టర్లను,ఇటు వైద్య సిబ్బందినీ, ఎప్పుడూ అలర్ట్ చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల వైద్య అవసరాలను తీర్చేందుకు కావలసిన 
వనరులను సమకూర్చేందుకు ప్రభుత్వం శాయిశక్తులాకృషి చేస్తుంది.
                                     
కామెంట్‌లు