స్నేహం;-వి. నందిని--9వ తరగతి--'ఈ' సెక్షన్--జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ సిద్దిపేట9959906527
ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. ఒకరికొకరం అన్నట్టు ఉండేవాళ్లు. వారి పేర్లు నిత్య మరియు కీర్తి. ఇద్దరిలో ఒకరికి ఏదైనా తట్టుకోలేరు. తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇలా చాలాసార్లు ఎన్నో చిలిపి పనులు చేసేవారు. నిత్యా కి బయట తినడం, తిరగడం అంటే చాలా ఇష్టం. అలాగే కీర్తికి కూడా ఇష్టం వాళ్ళిద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి బయట దుకాణాలు తిరిగేవారు. ఎందుకంటే ఇదంతా నిత్యా వాళ్ళ అమ్మకి నచ్చేది కాదు కీర్తిపై  నిత్యని మాట్లాడనివ్వలేదు ఎందుకంటే కీర్తిపై నిత్య వాళ్ళ అమ్మకి చెడు ప్రాయం ఏర్పడింది ఇంకా నిత్య వాళ్ళ అమ్మ నమ్మిక తనతో ఉండనివ్వదు కొన్ని రోజుల తర్వాత నిత్యకి ఆరోగ్యం బాగా ఉండకపోవడంతో నీరసంగా ఉంటుంది ఇదంతా తెలిసిన కీర్తి ఆసుపత్రి వెళ్తుంది అక్కడ ఉన్న ఆస్పత్రిలో డాక్టర్లు ఈ అమ్మాయికి లోపల లోపల కిడ్నీ క్షీణిస్తుంది అని డాక్టర్లు అంటారు ఇదంతా విన్న కీర్తి ఇంకా తట్టుకోలేక నేనున్నాని ముందుకు వచ్చి కీర్తి కిడ్నీ ఇస్తుంది ఒకరోజు కీర్తి స్కూల్ వెళ్లేదారిలో ప్రమాదం జరుగుతుంది తన రక్తము మొత్తం రోడ్డుపై ప్రవహిస్తుంది తనని ఎవరూ పట్టించుకోవడం లేదు అప్పుడే నిత్య స్కూల్ వెళ్లే సమయం అయింది ఇంకా బయలుదేరింది అక్కడ ఉన్న తన స్నేహితురాలని చూసి కీర్తి ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అప్పుడు డాక్టర్లు ఎవరైనా రక్తం ఇవ్వాలి అని అంటారు కీర్తికి. నిత్య ఆలస్యం చేయకుండా తన రక్తాన్ని ఇస్తుంది ఇలా అలా స్నేహం చాలా అద్భుతంగా నడుస్తుంది
నీతి: ఈరోజులలో చాలామంది కులం మతం అనేవి పాటిస్తున్నారు ఇది చాలా నేరం ఏ కులం మతం లేకున్నా మనసు ఉంటే చాలు స్నేహం అంటే ఒకరికొకరు ప్రాణం ఇచ్చేది కష్టాల్లో కన్నీళ్లు తుడిచేవాడు ఆపదలో అండగా ఉండేవాడు బాధలో బంధువుగా తోడు ఉండేవాడు స్నేహితుడు ఈ దేశంలో స్నేహం విలువ తెలియని వారు ఉంటారేమో కానీ స్నేహం అంటే తెలియని వాళ్ళు ఉండరు.  నీవు నలుగురితో ఉన్న నీలా నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ కానీ నీలో నువ్వు లేకున్నా  మేమున్నామని చెప్పేది స్నేహం. స్నేహం అంటే మర్చిపోలేని బంధుత్వం ఆపదలో ఉన్న బాధలో ఉన్న అండగా ఉండేవాడే స్నేహితుడు. స్నేహం కోసం ప్రాణాలు అయినా ఇవ్వవచ్చు..

కామెంట్‌లు