దత్తపది;-మమత ఐలహైదరాబాద్9247593432
 నల్లి    పిల్లి   బల్లి తల్లి
==================
ఉ.
నల్లికి మిన్ననేననుచు నాటకమెంతగ నాడబూనిన్
పిల్లిగ కళ్ళు మూసుకొని పీల్చెడి పాలను గానలేరనిన్
బల్లిగ గోడనెక్కి మరి ప్రాకుచు వింతల నేలువారినిన్
తల్లియె గుర్తుబట్టునని దాగుడు మూతల నాపరేలనో!

కామెంట్‌లు