దత్తపది:-(ముత్యము, పైత్యము ,సత్యము ,నిత్యము)-మమత ఐల-హైదరాబాద్-9247593432
 ఉ.
ముత్యము సాటిరాదనుచు ముద్దుల సోదరి మాటజెప్పగన్
పైత్యము తోడ రావణుడు బ్రాహ్మణ వేషము గట్టివచ్చినన్
సత్యము జాడనెంచుకొని సాగరముండిన దాటివచ్చెనే
నిత్యము స్తోత్రముల్ జదివినేక్కువ తప్పులు జేయుటేలనో!

కామెంట్‌లు