కార్తీక దీపాలు;-మమత ఐలహైదరాబాద్9247593432
 తే.గీ
దివ్యమైనట్టి దీపాలు సవ్యముగను
కోవెలందున వెలిగించి బ్రోవుమనుచు
దైవమును వేడుచుందురు ధరణి యందు
పుణ్య కార్తీక మాసాన ముదితలంత
తే.గీ
పుణ్య నదునీటి స్నానాలు ముక్తినొసగ
భక్తి భావంబుతోవేడి శక్తికొలది
దీప దానాలు జేసేరు బాపనులకు
చీకటిని రూపు మాపేటి చెడును తుడువ
తే.గీ
వత్తులను లక్ష వెలిగించి భక్తితోడ
నుసిరి వృక్షంబు తులసిని నువిదయందు
లక్ష్మి నారాయణులవోలె రమ్యముగను
పూజలను జేసి వేడేరు పుణ్యమనుచు

కామెంట్‌లు