చక్రాల చట్రం;--కంచనపల్లి వేంకట కృష్ణారావు--9348612445

 పిల్లల్ని గురించి తల్లులు ఎంతో శ్రద్ధ తీసుకుంటుంటారు అటువంటి శ్రద్ధలోని భాగమే పిల్లలకి నడక వస్తుందని చక్రాల చట్రంలో కూర్చోబెట్టడం! అదిగాక కొందరు తల్లులు దీనిని ఒక ఆట వస్తువుగా కూడా భావిస్తుంటారు.
        నిజానికి ఇది పిల్లలను 'బంధించే' ఒక సాధనంగా కొందరు డాక్టర్లు భావిస్తున్నారు! దీనిని వాడటం వలన నడక ఏమాత్రం బాగు పడదని పరిశోధనలు తెలియచేస్తున్నాయి. వీటిలో నడవటం తెలియక కొందరు పిల్లలు కిందపడటం వలన తలకి,మెడకి గాయాలు అవుతుంటాయి.ఇది మరీ ప్రమాదం.అందుకే కొన్ని దేశాలు వీటిని నిషేదించాయి.
      పిల్లలకు నడక నేర్పేందుకు ప్రత్యేక సాధనాలు అవసరంలేదు ప్రకృతే వారికి నడక నేర్పుతుంది.
      చిన్న పిల్లలకు సంబంధించిన మరొక ముఖ్య అంశం వారికి నోటిలో దంతాలు వస్తున్నప్పుడు జ్వరం,జలుబు,విరోచనాలు అవుతున్నాయని తల్లులు భావిస్తుంటారు.కాని అది నిజం కాదు అప్పడే వస్తున్న దంతాలు ఏవిధమైన అనారోగ్యం కలుగచేయవు.వారికి దంతాలు వస్తున్నప్పుడు చిగుళ్ళమీద దురద లేక కొంత అసౌకర్యం ఉండవచ్చు,ఉమ్మి ఎక్కువ రావచ్చు.పసిపిల్లలు వస్తువులు,మట్టి నోటిలో పెట్టుకోవడం వలన వారికి విరోచనాలు అవవచ్చు.
కొత్తగా వస్తున్న దంతాలకు మందులు,కొన్నిరకాల టూత్ పేస్టులు అవసరం లేదని శిశు వైద్యులు చెబుతున్నారు!
                  *****      *******

కామెంట్‌లు