యం.రాజశేఖర్--ఆలూరు మండలం కర్నూలు జిల్లా.9381004519.
 ముత్యాల హారాలు
_________
1)
ఓజోను పొరకు రంధ్రం
మానవాళికి అపాయం
అరికడ్దాం కాలుష్యం
సురక్షితంగ జీవిద్దాం
2)
అమ్మ చేతి వంటకం
బహు రుచి గల వంటకం
గుమగుమలాడె వంటకం
నోరూరించె వంటకం
3)
నేడు పసి బాలలము
కాబోయే పౌరులము
అభివృద్ధికి కారకము
భారతమ్మ వారసులము.
4)
మా భారతదేశము
అన్ని మతాలకు నిలయము
సఖ్యతతో ఉంటాము
కలిసి మెలిసి బతుకుతాము
5)
చిరుతిళ్ళ  అలవాటు
ఆరోగ్యానికి చేటు
ఎక్కాలి దవఖాన మెట్టు
ఎదిరించాలి ఇక్కట్టు.
6)
విజయంకు పొంగిపోకు
అపజయంకు కుంగిపోకు
దేనికి వెనుకడుగయ్యెకు
నీ ప్రయత్నం విడువకు
7)
మా పల్లె అందాలు
చూడదగిన దృశ్యాలు
పచ్చని పాడిపంటలు
కనువిందుకు కారకాలు
8)
మన భారతదేశం
సకల వనరులకు నిలయం.
ఏకత్వంలో భిన్నత్వం
మన దేశ గొప్పతనం
9)
ఔషధాలకు నిలయం
మన భారతదేశం
జగతికే ప్రాణదాతలం
మనవాళికి ఆదర్శం
10)
మద్యపాన సేవనము
లివరుకు హానికరము
జేబుకు చిల్లు ఖాయము
జీవితమే నాశనము.

కామెంట్‌లు