వెలగాలని వెలుగు నవ్వింది
ఉప్పొంగిపోయింది తననుతాను
దాచుకోను తరగని కష్టం
చీకటి గర్వంతో విర్రవీగుతోంది
ఎదురు లేదని!!
వెలుగు నవ్వింది నేను ఉంటే కదా
నీకా జోరు నేను లేక నీవు లేవు
ఇది సత్యం, అనునిత్యం!!
చీకటి వెలుగుల స్నేహమా కయ్యమా!!
తెలియ కుంది ఈ చిన్ని హృదయానికి
తెలుసుకుందామని ప్రయత్నం
కానీ సఫలీకృతం అగునా?
వెలుగు విజృంభించు సర్వదిక్కుల
చిరుకంత స్థలములో సంతోషాలు
పంచు సకలముల వెలుగుగా
వెలగాలని కోరిక!!!
కానీ కానీ చీకటి కమ్ముతోంది.
పెను భూతంలా పెరిగి వెలుగును
కబళిస్తోంది కడుపులో దాచుకోను
కడు దుర్మార్గపు చర్య తో, కలుషీకృతం
అవుతోంది ఆలోచన!!
ఏమిటిది, చెబుదామంటే చీకటి వెలుగులు
జంట పదాలు తోడు నీడలా కానీ
తారతమ్యాలు భూమ్యాకాశాలు
అంతులేని అనంతమైన యక్ష ప్రశ్న
ఎలా మరీ!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి