మరువను (బాల గేయం);-రావిపల్లి వాసుదేవరావుపార్వతీపురం9441713136
మరువను మరువను
గురువును మరువను
గురువు చెప్పిన
బోధలు మరువను

మరువను మరువను
అమ్మను మరువను
అమ్మ పంచిన
ప్రేమను మరువను

మరువను మరువను
నాన్నను మరువను
నాన్న నేర్పిన
నడతను మరువను

మరువను మరువను
తాతను మరువను
తాత చెప్పిన
కథలను మరువను

మరువను మరువను
అన్నను మరువను
అన్న చెప్పిన
ఆటలు మరువను

మరువను మరువను
అక్కను మరువను
అక్క నేర్పిన
సుద్దులు మరువను

మరువను మరువను
మిత్రుని మరువను
మిత్రుడు చేసిన
సాయం మరువను కామెంట్‌లు