మేధావి యార్లగడ్డ-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, హిందీలో నవలలు రాశాడు.   వాజ్పాయ్ గారి జీవిత చరిత్ర నుంచి అనేక ఘట్టాలను పురస్కరించుకొని వ్రాసిన ప్రతి పుస్తకం వాజ్పాయ్ గారి లాంటి  మేధావుల ప్రశంసలు పొందింది  కవితలు రచన అంటే  ప్రత్యేకించి ఎల్లోరా అంటే ప్రత్యేకమైన అభిమానం.   అనేక సభలలో వారి కవితా వాక్యాలను ఉదాహరణగా ఇస్తూ ఉంటాడు. రేడియోలో పెద్దవారు ఎవరైనా మరణించినప్పుడు,  జన్మించినప్పుడు వారి గురించి రూపకాలను చేయడం ఆనవాయితి. రాజా రామ్మోహన్ రాయ్ జయంతిని చేయడానికి సంసిద్ధమయ్యాం.  ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఆలోచించి వారి గురించి తెలిసిన రచయితతో నాటకం వ్రాయించి ఆ నాటకాన్ని ప్రసారం చేద్దామని సలహా ఇస్తే  మా సంస్థ సంచాలకులు ప్రసాద్ రావు గారు మీరు ఏర్పాట్లు చూడండి అని అన్నారు. విశాఖపట్నం విశ్వవిద్యాలయానికి వెళ్లి లక్ష్మీ ప్రసాద్ గారిని కలిసి విషయం చెపితే ఎప్పటికి కావాలన్నాడు  మీరు ఇప్పుడిస్తే ఇప్పుడే ప్రసారం చేస్తాను అని చెప్పాను. అత్యవసరంగా ఆ రోజంతా కూర్చుని తెల్లవారి అరగంట నాటకం తయారు చేసి ఇచ్చారు. దానిని నేను, ఇందిరా, పద్మజా, సుజాత వాళ్ళతో రికార్డ్ చేశాను. లక్ష్మీ ప్రసాద్ గారు ఒక రేడియో  రూపకం ఇవ్వడం ఇదే ప్రథమం. అది రాయడానికి కారణం నేనే కావడంతో  ప్రచురించిన ఆ గ్రంథాన్ని నాకు అంకితం ఇచ్చారు. అంత మంచి మనసున్న మనిషి. నాకు, రేడియో సుమన్ కు  ఆత్మీయ మిత్రుడు. ఆ తరువాత అనేక నాటికలు, రూపకాలు ఆయన కలం నుంచి వచ్చాయి.
యార్లగట్ల లక్ష్మీ ప్రసాద్ గా ఉన్నప్పటి నుంచి  డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గా మారినంత వరకు నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. తాను విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే  నాకు తెలుసు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేసిన సుమన్ ద్వారా నాకు పరిచయం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు  మా స్నేహం అలా కొనసాగుతూనే ఉంది  మంచి స్నేహశీలి  ఎదుటివారి మనస్తత్వాలను అర్థం చేసుకోగలిగిన మనిషి. ఆ తరువాత విశ్వవిద్యాలయం విశాఖపట్నం అక్కడ ఉద్యోగం మధ్యలో ఆపి దేశ విదేశాలలో ఉన్న ప్రదేశాలకు వెళ్లి  అనేక రంగాలలో పరిచయం చేసుకున్న మేధావి. వాజ్పేయి, అద్వానీ లాంటి వారి సహచర్యం కలిగిన వాడు. ఎన్టీ రామారావు గారికి హిందీ సినిమా కోసం సహకరించిన వాడు  అన్నిటికి మించి మంచి మనసున్న వాడు, పరోపకారి.


కామెంట్‌లు