ఊరు వదలాలి;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ మనస్తత్వాన్ని అద్భుతంగా వ్యక్తీకరించిన వాడు వేమన సామాన్యంగా ప్రతి మానవునికి తనకు ఏది లేదో దానిని పొందాలన్న ఆశ ఉంటుంది అది సహజం కూడా. పల్లెపట్టున ప్రశాంత జీవితం గడుపుతున్న వాడు పట్టణ జీవితం అయితే హాయిగా విలాసవంతమైన  జీవిగా ఉండవచ్చును కదా అని కలలు కంటాడు  నగరంలో ఉన్నవారు  పల్లెపట్టులు ఎంత అందంగా ఉంటాయి అక్కడ సౌందర్యాన్ని చూస్తూ  గ్రామం మొత్తం ఒక కుటుంబం గా జీవిస్తే  ఎంత ఆనందమైన జీవితం  అనుకుంటాడు  అది పట్నమైనా నగరమైనా  చివరకు పల్లెటూరు అయినా  ఆ గ్రామంలో తనకు అణువుగా లేకపోయినట్లయితే  జీవితం  కష్టంగా గడుస్తోంది అన్న నమ్మకం కలిగిన తర్వాత  ఆ గ్రామాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్లి జీవితాన్ని కొనసాగించమని వేమన మనకు  ఉద్బోధిస్తున్నాడు.
మానవ సమాజంలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది  ప్రత్యేకించి గృహిణిని గురించి మన పెద్దలు చాలా గొప్పగా చెబుతారు  ఆ ఇల్లు కళకళ లాడాలన్నా ఆ ఇంటి గౌరవ మర్యాదలను నిలబెట్టాలన్నా  పిల్లలను తీర్చిదిద్దాలన్నా  భర్తకు సలహాలు ఇచ్చి సరైన మార్గంలో ఉంచాలన్నా అత్తమామలకు సేవలు చేస్తూ  వారి ఆదరాభిమానాలను పొందాలన్నా  ఒక్క గృహిణి కే తెలుసును  బంధువులు కానీ, స్నేహితులు గాని వచ్చినప్పుడు వారిని ఎలా ఆదరించాలి  అన్న విషయం  ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు  అలాంటి అమ్మాయి మనోదౌర్బల్యంతో కానీ  మరి ఏ కారణంగా నైనా చేయవలసిన  పద్ధతులకు భిన్నంగా వ్యవహరించి  చెడు మార్గాల కలవాటు పడి  ఆ కుటుంబానికి  మచ్చ తెచ్చేలా  ప్రవర్తించినప్పుడు ఆమెను విడవడం వల్ల  మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని వేమన అభిప్రాయపడుతున్నారు.
వేమన కాలంలో రాచరికం  రాజ్యమేలుతున్నది సర్వ స్వతంత్ర అధికారి రాజు వారు ఏది చెబితే అది జరిగింది  నాలుగవ తరగతి ఉద్యోగి సేవకుని దగ్గర నుంచి    ప్రధాన అమాత్యుని  వరకు ప్రతి ఒక్కరూ వారి ఆజ్ఞను పాటించి తీరవలసినదే  లేకపోతే ఆ రోజులలో శిరచ్చే దనమే  దానికి నిర్ణయాధికారి కూడా రాజే  ఆరు కాలం కష్టించి  నిజాయితీగా ఉద్యోగం చేసినవాడు తనకు రావలసిన  జీతాన్ని రాజు ఇవ్వకపోతే  ఆ కొలువు కూటంలో శాశ్వతంగా   కట్టు బానిసగా ఉండవలసిందేగా అనే ప్రశ్న వచ్చినప్పుడు వేమన, తీర్పు  అవసరం లేదు వెంటనే ఆ ప్రాంతాల నుంచి వెళ్లిపోవడం శ్రేయస్కరం అంటాడు. గ్రామాన్ని గురించి ఆర్ధాంగిని  గురించి సేవకుని గురించి  ఎంత అందమైన తీర్పు ఇచ్చారు అది సరైనదో కాదో  ఈ పద్యం చదివి మీ తీర్పును ఇవ్వండి.

"విడువ వలయు నూరు విశ్రాంతి గాకున్న  విడువవలయు నాలి విధము చెడిన 
విడువ వలయి రాజు వితరణి గాకున్న..."కామెంట్‌లు