పంచభూతాత్మకం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జనని అంటే మనకు జన్మనిచ్చినది కనుక ఆమెను తల్లి అని పిలుస్తున్నాం. ఈ జన్మకు కారణమైన తొమ్మిది నెలల భారాన్ని ఆమె ఎలా మోసింది. ఆ బిడ్డను భూమి మీదకు ఎలా పంపింది. అది మాత్రం ఆలోచించం. శుక్ల శోణితముల వల్ల శుక్ల రక్తముల వల్ల బిందు ఏర్పడుతుంది. ఆ తరువాత 15 రోజులకు బుడగరూపం వస్తుంది నెల గడిస్తే అది గట్టిపడి 45 రోజులకి పిండాకృతిని ధరిస్తుంది అని శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు. మొదటి నెలలో చాపలాగా,  రెండవ దశలో  తాబేలుగా, మూడవ  నెలలో  పందిగా, తరువాత నర సింహం  మృగము మానవ రూపం ధరించే  ప్రయత్నం, తరువాత వామనం,  పరశురాముడు, రాముడు, బలరాముడు  బుద్ధి వచ్చిన తర్వాత  పరిపూర్ణ బాల అవతారం ఈ భూమి మీదకు వస్తుంది. అది తెలుసుకుంటే తప్ప తల్లి తత్వం ఏమిటో మనకు అర్థం కాదు  నిజంగా అది తెలిసిన వాడు తల్లిని దైవాన్ని మించి చూస్తాడు. ఈ భూమిపైన  మనిషి హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి కారణం  ఎవరో తెలుసుకోవాలనుకుంటే... ఆకాశం నుంచి వచ్చినటువంటి  శబ్దం వినడానికి చెవి  వాయువు వీచినది అని తెలుసుకోవడానికి  కారణభూతమైన చర్మం  పంచభూతములలో కంటికి కనిపించే మొదటి వస్తువు మంట అగ్ని దానిని చూడడానికి కన్ను  దాని తర్వాత జలం ఆ నీటి రుచి తెలియడం కోసం నాలుక  చివరిది భూమి ఈ భూమి వల్ల వచ్చే వాసనను గ్రహించడానికి నాసిక ఏర్పాటు చేయబడ్డాయి. ప్రకృతి ఇచ్చిన పంచభూతముల కలయికకు  ఈ జ్ఞానేంద్రియములు 5 కలిసి  ఈ శరీరం ప్రవర్తించవలసిన తీరును చెబుతుంది  రెండు చేతులకు ఉన్న పది వేళ్లను కలిపి శిరస్సును వంచి హృదయపూర్వకంగా పెద్దలను గౌరవించడం తల్లిని తండ్రిని పూజించడం గురువును భగవత్ స్వరూపంగా భావించి  అగ్రస్థానాన్ని ఇవ్వడం  ఇలాంటివన్నీ తెలుసుకున్నవాడు అతి పెద్దదైన పంచము పంచభూతములతో ఏర్పడిన ఈ తనువు యొక్క స్థితిని  తెలుసుకున్నవాడు అవుతాడు. ఈ ప్రపంచంలో ఎన్నో విజయాలను సాధించిన ఎంతోమంది గొప్పవారు కూడా  తనను తాను దర్శించుకునే స్థితిలో ఉండరు  ఒక రమణ మహర్షి  ఒక మళయాల స్వామి లాంటివారు  జగద్గురు శంకరాచార్యుల వారి వంటి వారు తప్ప మరొకరికి తెలియదు. ఎవరైతే ఈ చిన్న విషయం భూమి గురించి పూర్తిగా తెలిసినవారు  అలాగే ఆకాశం నుంచి, భూమి మధ్య ఉన్న అన్ని విషయాలను తెలిసినవారు తప్పకుండా తనను తాను తెలుసుకుంటారు అని వేమన  అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విషయాన్ని  తన ఆటవెలది ద్వారా పద్య రూపంలో మనకు అందించారు. ఆ పద్యాన్ని మీరు కూడా చదివి  ఆత్మా వలోకనం చేసుకోవడానికి  ప్రయత్నం చేస్తారని  వేమన భావన  ఆ పద్యాన్ని ఒకసారి చూడండి.

"తల్లిని యెరుగువాడు దైవంబు నెరుగును 
మన్నునెరుగువాడు మిన్ను నెరుగు 
మిన్ను మన్నెరిగిన తన్ను తానెరుగును"కామెంట్‌లు