వ్యాసమహర్షులవారు భారత దేశంలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా ఉండాలి అన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం మహాభారతాన్ని రాసి మన కందించారు. దానిలో కుంతీదేవితో పాటు ఐదుగురు మాతలను గురించి ఉదహరించారు. దానిలో ప్రత్యేకించి ద్రౌపది పేరు ఉన్నది మహా పతివ్రతలలో స్థానాన్ని సంపాదించింది. పాంచ భౌతిక స్థితిలో ఉన్న పంచ పాండవులకు పట్ట మహిషిగా స్థిరపడినది. వాక్ చాతుర్యము కలిగినది పాండవుల కౌరవులను ఆధారం చేసుకుని అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందించారు. ఆశ దురాశగా మారినప్పుడు మానవ ప్రవృత్తి ఎలా ఉంటుందో చెప్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్మను న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని వారి పాత్రను కూడా సృష్టించారు కనుకనే మహాభారతం సాహితీ ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని పొందింది.
శకుని శపథాన్ని నెరవేర్చుకోవడం కోసం అతని మాయాజాలంలో దుర్యోధనుడు చిక్కుకోవడం ప్రధాన సలహాదారులుగా శకుని ఉండడం, దుర్యోధనుని ద్వారా జూదానికి ధర్మరాజును ఆహ్వానించడం ఆ పందెంలో ప్రావీణ్యం ఉన్న శకుని గెలిచి ధర్మరాజు ఓడిపోవడం కథ. తన నలుగురు సోదరులతో పాటు ద్రౌపదిని కూడా పణం పెట్టి ఆ జూదంలో ఓడిపోతాడు అది ఆసరాగా తీసుకొని దుష్టబుద్ధితో ఉన్న దుర్యోధనుడు తన తమ్ముని పంపి ద్రౌపది కొప్పు పట్టుకొని లాగి కొలువుకూటమిలోకి తీసుకువచ్చి ఆమెను వివస్త్రగా చేయడం కోసం ప్రయత్నం చేయడం దేశ ప్రజలందరూ తలదించుకోవలసిన విషయం న్యాయానికి తలవొగ్గి ధర్మరాజు మాట్లాడకపోవడం అప్పుడు ద్రౌపతి అడిగిన ప్రశ్న నన్నోడి తానిడిన తానోడి నన్నోడిన అని. ఓడినది దాసి కనుక ప్రశ్నించే హక్కు లేదు అని రాజుగా శాసించడం.
శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను రక్షించడం అది కథ చెప్పదలుచుకున్న విషయం కాలం సమీపించినప్పుడు ఏ మానవుడైన మరణించక తప్పదు దానికి ఏదో ఒక కారణం ఉండి ఉండాలి అని భావించి గదా యుద్ధంలో హేమాహేమిలతో నీవా నేనా అన్నట్టుగా పోరాడగలిగిన పటిమ కలిగిన వాడు అస్త్ర శస్త్ర విద్యలలో మేటి తల్లి గాంధారి ఆశీస్సులు ఉన్నా భీముని చేతిలో మరణించక తప్పలేదు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అందులో పర స్త్రీకి అన్యాయం చేయాలని, ఆమె మానాన్ని కాపాడకపోగ భక్షించడానికి ప్రయత్నం చేసిన దుష్ట దుర్యోధన చర్యకు ప్రాయశ్చిత్తంగా జీవితంలో ఏ ఒక్కరూ ఊహించని పద్ధతిలో వ్యాసమహర్షి దుర్యోధనుడి తొడలను విరగకొట్టించి భీ మునితో చంపించాడు ఇంత గొప్ప నీతిని ఒక్క ఆటవెలది లో మన ముందు వుంచాడు వేమన ఆ పద్యాన్ని ఒక్కసారి చూడండి.
"కోరి దృపదుని పుత్రి కొప్పు పట్టీడ్చిన
సింహబలుని చావు చెప్పదరమే
ముగియు కాలమునకు మొనగాడు నీల్గడా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి