ప్రాణ భయం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నిజాలు మాట్లాడవలసి వస్తే వేమన గురించి  ఈ ప్రపంచంలో ఉన్న ఎన్ని విశేషణాలు చెప్పినా తక్కువే.  జీవితాన్ని ఎంత గొప్పగా ఆయన అధ్యయనం చేయకపోతే  ఇంత అందంగా అక్షరాలను అల్లగలిగే కవిత వంటపడుతుందా అని  ఆశ్చర్యపోక తప్పదు. ఏ జీవికైనా తన తనువులో జీవం వెళ్ళిపోతుంది అని ఆలోచన వచ్చినప్పుడే దానిని పట్టుకోవడం కష్టం అది కార్య రూపంలో వస్తే అసలు భరించగలడా.  భర్త మరణించినప్పుడు  భార్య దుఃఖించడం సహజం. భగవంతుడు ఆయన్ని తీసుకువెళ్లే బదులు నన్ను తీసుకుని వెళితే ఎంతో ఆనందంగా ఉండేది ఆయన సుఖంగా ఉండేవాడు  అంటుంది. ఎవరైనా చొరవచేసి సరేనమ్మా నీవు చనిపోతే మీ ఆయన్ని బ్రతికిస్తాను అంటే  ఆమె స్థితి ఏమిటి? ఎవరి ప్రాణం వారికి అంత తీపి.
మనకు పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు జీవితంలో బంగారాన్ని చూసినా, అందమైన పడితిని చూసినా  అది తన సొంతం చేసుకోవాలి అని మనసులో అభిప్రాయం వస్తుంది. అది కార్యరూపం ధరిస్తుందా లేదా అనేది పక్కన పెడదాం బంగారం మీద అతనికి అంత ఇష్టం. ఆడవారు నగలు చేయించుకోవడానికి ఆశపడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ అతను ఆశపడడం అంటే అది పేరాశ  కిందకే వస్తుంది కదా. అయితే కొంతమంది బంగారు ఆభరణాలు తరించడం వల్ల శరీరానికి కీడు చేసి కంటికి కనిపించని క్రిమి కీటకాలను అది సంహరిస్తుంది అని  పండితులు చెప్తారు. కానీ వేమన ఆ కోణంలో చెప్పలేదు  మనిషి మానసిక స్థితిని అర్థం చేసుకుని  ఆశ, పేరాశ, 
దురాశ  భేదాలను చెప్పడం కోసమే ఈ ప్రయోగం చేశాడు.
ప్రాణాన్ని పసిడిని ప్రక్కన పెడితే  మానవుని అత్యంత  ఎక్కువగా ఆకర్షించేది పడతి  ఎవరైనా అందమైన అమ్మాయి కనిపిస్తే  వెంటనే యువకులు ఏమనుకుంటారు  బంగారు తల్లి లా ఉంది తళతళా మెరిసిపోతు వుంది కదా అదే వయసు పెరిగిన వాళ్ళు అయితే పుత్తడి బొమ్మలా ఉంది ఆ పాప నా కూతురుగా ఉంటే ఎంత బాగుంటుంది అని ముచ్చట పడడం సహజం. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు అందానికి పురుషుడు ఆకర్షణకు ఆడది అని  ఒకసారి సూదంటిరాయికి ఇనుము ఆకర్షిస్తే అది అంత త్వరగా బయటికి రాదు. ఇది కూడా మోహం కిందకు వస్తుంది. అది జీవి బ్రతికి ఉన్నంతవరకు శాశ్వతంగా ఉంటుంది. అది ఫలించక పోతే   ప్రాణాన్ని తీస్తుంది. పసిడిని ఉదాహరిస్తూ వేమన చెప్పిన  అద్భుతమైన పోలికలను  ఆస్వాదించవలసినదే ఆ రోజులలోనే అంత మేథను ఉపయోగించిన వాడు  మేధావి వర్గంలో ప్రథమ శ్రేణిలో నిడవకేం చేస్తాడు. ఆ పద్యాన్ని ఒక్కసారి చదవండి.

"తీపికెల్లదీపి తెలియంగ ప్రాణంబు  
ప్రాణ వితతి కన్న పసిడి తీపి  పసిడికన్న మిగుల పడతి మాటలు తీపి"


కామెంట్‌లు