భిన్న తత్త్వాలు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 జీవితం అంటేనే భిన్న తత్త్వాల మధ్య గడపడం సమాజంలో ప్రతి ఒక్కరు ఒకే రకంగా ఉండరు కదా  ఎవరి ఆలోచనలు వారివి  వారు ఏం చేయదలుచుకున్నారో వారి పద్ధతిలో వారు చేయడం వారి అలవాటు  నిత్యం భిన్న మనస్తత్వాలతో ఉన్న మనుషుల మనస్తత్వాలను  ఒకటిగా చేయడం అనేది  సాధ్యమేనా. కనుక వాటిని ఏకం చేయడానికి ఏ ఒక్కరూ ప్రయత్నం చేయరు. అయితే దీనిలో  నీచ మానవులు ఉంటారు, ఉత్తమ వ్యక్తులు ఉంటారు  మంచి తప్ప కలలో కూడా చెడు గురించి ఆలోచించని వ్యక్తులు వుంటారు. నీచ స్థితిలో ఉంటూ  తనకు సమాజానికి ద్రోహం చేస్తున్న వ్యక్తులను  గమనిస్తూనే ఉంటారు కానీ  వారిని సరైన మార్గంలో పెట్టడానికి  ఎంతమంది ప్రయత్నం చేసినా దుష్ట బుద్ధి మారే ప్రసక్తే లేదు  అందుకే వారికో నమస్కారం చేసి ఓడిపోవడమే. రాజుల కాలంలో సేవకులు ఉండేవారు  తరువాత కాలంలో ధనవంతుల దగ్గర చాకర్లు, నౌకర్లు ఉండేవారు. చాకర్లు రోజంతా శ్రమించి దానికి తగిన ప్రతిఫలాన్ని ఆ రోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్లి  తమ కుటుంబాలు గడుపుకుంటూ ఉంటారు. నౌకర్లు యజమాని దగ్గర  శాశ్వత  ప్రాతిపదికపై ఉండి  ప్రతి నెల మొదటి వారంలో  వారి జీతాన్ని తీసుకుని వెళ్లి భార్య చేతిలో పెట్టి  కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు  ఈ నౌకర్లు గాని చాకర్లు గాని  ఏదైనా తప్పు చేసినప్పుడు యజమాని ఎందుకు ఇది చేశావు ఇలా చేయవచ్చునా అని అడిగితే  తెలియక చేశాను స్వామి  అలాంటి తప్పు మరి ఎప్పుడు చేయను  ఈ ఒక్కసారికి క్షమించండి  అని అంటే  ఆ మాటల్లోనే  యజమానికి అర్ధమైపోతుంది  అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా కావాలని చేసిందా అని. అది గమనించి క్షమించి  ఇంకెప్పుడు ఇలా చేయవద్దని  హెచ్చరించి పంపిస్తారు.
చాలా మంచి  అమాయకత్వంతో ప్రతివాడిని నమ్మి  మోసపోతూ ఉంటారు అతనిని చూడగానే  మంచి చెడు నిర్ణయించుకోలేని తత్వం  నమ్మిన వాడిని మోసం చేసే తత్వం అతనిది  అతని ప్రవర్తన వల్ల స్నేహితులను నమ్మించి  వారి వల్ల ఎంతో లబ్ధి పొంది చివరకు వారిని మోసం చేసే స్థితికి వస్తారు. అందుకే వేమన చెప్తాడు  దుష్టులకు దూరంగా ఉండాలి  అతను చెప్పే తియ్యని మాటలను నమ్మి  మోసపోకండి అని చెప్పడానికి  ఈ పద్యాన్ని మనకు అందించారు. ఉత్తములతో స్నేహం చేయడం వల్ల ఎలాంటి చెడు జరగదు. నీచులతో  చెలిమి పెంచుకున్నప్పుడు జరిగేదంతా హాని మాత్రమే అలాంటి కుట్రలకు బలి కాకుండా అలాంటి అమాయకత్వం నుంచి బయటపడమని వేమన మనకు సలహానిస్తున్నారు. ఆ పద్యం వినండి.

"దాసరయ్య తప్పు  దండముతో సరి 
మోసమేది తన్నుమించకున్న  నీచుడై చెడునటు నీచుల నమ్మిన..."


కామెంట్‌లు