భారతీయులలో భక్తిభావం చాలా ఎక్కువ కనిపించిన చెట్టు పుట్టను కూడా భగవత్ స్వరూపంగానే చూసే తత్వం తన కన్నా పెద్ద వారిని కూడా చూసి నమస్కరించకుండా వెళ్ళలేడు. అలాంటి వ్యక్తులు ఈ దేశంలో ఎక్కడ ఏ తీర్థం గొప్పదో అక్కడ మనసులో ఉన్న మాలిన్యాలను అన్నిటిని కడిగి వేయడానికి ఒక్కసారి వెళ్లి స్నానం చేస్తే బాగుండును అనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు తన దగ్గర వెళ్లి రావడానికి ఖర్చులు కూడా లేకపోయినా అప్పు చేసి అయినా వెళ్లి స్నాన సంధ్యలు ముగించుకొని ప్రక్కనే ఉన్న
క్షురకర్ముని (మంగలి) పిలిచి జుట్టు తీయించి తిరిగి స్నానం చేసి ప్రక్కనే ఉన్న గుడికి వెళ్లి ప్రదక్షణ చేసి గోత్రనామాలతో పూజలు చేసి తిరిగి వచ్చే సంప్రదాయం. దానితో ఆ వ్యక్తికి కలిగేతృప్తి దేనితోనూ పోల్చలేము. ప్రత్యేకంగా తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా తన నీలాలను నూటికి 90 మంది ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం ఆ జుట్టు ఇచ్చేవారికి స్వామికి ఎందుకు ఇస్తున్నాము అన్న విషయం తెలుసా తెలియదా అన్న విషయాన్ని ప్రస్తావిస్తే పెద్దలు మొక్కుకున్నారు కనుక ఇచ్చాం వారు ఎందుకు మొక్కుకున్నారో వారి మొక్కు తీరిందో లేదో దానికీ జుట్టు ఇవ్వడానికీ సమన్వయమేమిటో మాకు తెలియదు అని చెప్పేవాళ్లు చాలా ఎక్కువమంది ఉంటారు. ఓం కేశవాయ స్వాహా అని భగవంతుని కీర్తిస్తాం. కేశము అంటే జుట్టు ఆ జుట్టు ఇవ్వమని కోరుకోవడం ఏమిటి దానికి అర్థం తెలిసే చేస్తున్నారా కేశము అంటే జ్ఞానము నాకు మీ శక్తి వల్ల జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకుంటున్నాడు భక్తుడు నిజంగా దాని అర్థం తెలిసి అలా అంటున్నాడా అంటే కాదనే సమాధానం.
దానికి వేమన ఏం చెప్తున్నాడంటే ఇది నమ్మకమో, మూఢనమ్మకమో ఎవరికీ తెలియదు. అనూచానంగా పెద్దలు చెప్పారు కనుక అలవాటు ప్రకారం వీరు చేస్తుంటారు అంతే అయితే దాని వెనుక ఉన్న తత్వం తెలుసుకోవటానికి ఈ శరీరంలో మనకు ఏ అవసరం కావాల్సి వచ్చినా ఏ ఆలోచన కావలసి వచ్చిన పని చేసేది మనస్సు కదా ఆ మనసుని నీవు స్వాధీనం చేసుకున్నట్లయితే జీవితంలో దేనిని సాధించాలనుకుంటున్నావో దానిని తప్పకుండా ముందు దానిని సాధించు. గుడిలోకి వెళ్లి నదులకు వెళ్లి తలలను బోడిగా తయారు చేయడం కాదు మనసును బోడిని చేయి అన్నీ వాటంతట అవే నీకు సమకూరతాయి అని చెప్పడం ఎంత పరిణతి చెంది, ఎంత ఆలోచించి, ఎంత అనుభవంతో చెప్పగలడు మహానుభావుడు. వారు చెప్పిన పద్యం మీరు చదవండి.
"సకల తీర్థములను సకల యజ్ఞంబుల
తలలు గొరిగినంత ఫలము గలదె
తలలుబోడులైన తలపులు బోడులా..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి