ఖలుని మాటలు;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మనం ఈ సమాజంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను గమనిస్తూ ఉంటాం  అతను ఎందుకు మంచిగా ఉంటాడో ఎందుకు చెడుగా ఉంటాడో మనం చెప్పడం కష్టం  వారి రక్తంలో ఉన్న గుణం అలాంటిది  ఎంత మంచి వారైనా వారిలో కొంచెం  చెడు ఉండడానికి అవకాశం ఉంటుంది  అది సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది.  అలాగే చెడ్డవారిని మనం చూసినప్పుడు హత్యలు, దోపిడీలు మానభంగాలు చేయడం తప్ప మరొక పని ఉండదు  పనీపాటా లేకపోయినా ఎదుటివారిని దూషించడం ఎందుకు అలా చేస్తారో తనకు కూడా తెలియదు. అలాంటి వారు ఎప్పుడైనా ఒక మంచి పని సందర్భాన్ని బట్టి చేసినప్పుడు  ఇతనేనా ఈ పని చేసింది అని ఆశ్చర్యపోక తప్పదు అలాంటి స్థితిగతులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది విమర్శకులు ఉంటాడు. వీరిలో కూడా రెండు రకాలు ఎవరైనా ఒక మంచి గ్రంథం రాస్తే ఆ రచయిత తనకు సన్నిహితుడు  తెలిసినవాడై ఉంటే  అతను రాసిన ప్రతి వాక్యాన్ని అద్భుతంగా  విశ్లేషిస్తూ  ఇలాంటి రచయితలు మనకు దొరకడం కష్టం  వీరి లాగా వ్రాసే వారు చాలా అరుదు అంటూ పొగడ్తలతో ముంచి వేస్తారు.  అదే తన వాడు కాకుండా తనకు ఇష్టం లేనివాడు అయితే  అసలు ఇతను రచనలు చేయడం ఏమిటి  అక్షరాలు కూడా తెలియని వాడు రాయడానికి సమకడితే  పాఠకుడి పరిస్థితి ఎలా ఉంటుంది అని దూషిస్తూ ఉంటారు.అదే వ్యక్తిత్వాలను గురించి కూడా ఎవరైనా ఒక వ్యక్తిలో ఉన్న సుగుణాలను గురించి వీరు అలా చేశారు ఇలా చేశారు అని  వ్రాస్తే ఒక రకమైన  విమర్శకులు సద్విమర్శకుడైతే  దానిని ఆమోదిస్తారు లేకుంటే కువిమర్శకుడు చెడుగా మాట్లాడుతాడు. ఆంధ్రదేశానికి  ప్రథమ జ్ఞానపీఠ బహుమతిని తెచ్చిన ఘనుడు విశ్వనాథ సత్యనారాయణ గారు  సత్యమును మాత్రమే మాట్లాడడం వ్రతముగా కలిగిన వాడు వారికున్న  వాక్ శుద్ధి చాలా తక్కువ మందికి ఉంటుంది. వారి నోటితో ఏ విషయాన్ని చెప్పినా అది నిజమవుతుంది  ఒకరిని అభినందిస్తే  అది అతనికి వరంగా  ప్రభావాన్ని చూపుతుంది. వారికి ఏదైనా కోపం వచ్చి చెడు మాట అంటే అది తప్పకుండా ఆ వ్యక్తికి తగులుతుంది ఆ ప్రభావాన్ని తన జీవితంలో అనుభవిస్తారు. అలాంటి వారి  మాటలను వినడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపిస్తారు  వారు ఏది మాట్లాడినా అది శాస్త్రీయంగానే ఉంటుంది  కనుక పరుష వాఖ్యాలు  పట్టించుకోనవసరం లేదు. ఇలాంటి వారి మాటలను  ఆశీర్వచనాలుగా స్వీకరించ తగినవి.

"ఖలులు దిట్టి రంచు  గలవరపడనేల  
వారిదిట్లనేమి చెడును  సజ్జనుండు దిట్ట శాపంబదౌ నురా..."


కామెంట్‌లు