విశ్వనాధ వారు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఏ మాధ్యమంలోనైనా  ఓ చక్కటి కథను ఎన్నుకొని  దానిని నిర్వహిస్తే అది అటు ప్రేక్షకులను ఇటు శ్రోతలను అలరిస్తుంది అలాంటి కథలు  ఎలాంటి కథలు మనం ప్రసారం చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని గురించి  ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో బాగా ఆలోచించినవారు బందా కనక లింగేశ్వర రావు గారు వారి నిర్వహణలో వచ్చిన పౌరాణిక  జానపద సాంఘిక నాటకాలలో  ప్రతి ఒక్క నాటకం  శ్రోతల అభిమానాన్ని చూరగొన్నదే  ఈ నాటకంలో ఈ తప్పు ఉంది  ఇలాంటి తప్పులు ఇక ముందు చేయకండి అని  ఏ విమర్శకుడు మాకు ఉత్తరం రాయలేదు. అలాంటి అవకాశం  విమర్శకులకు ఇవ్వలేదు. బందా గారు నాకు తెలిసి ఒక నాటకాన్ని గురించి ఆయన ఆలోచించినప్పుడు నాలాంటి వారితో కూడా చర్చించి  ఇలా చేస్తే ఎలా ఉంటుంది  అని అడిగే సంస్కారం ఆయనకు ఉంది. ఆనాటి అన్నపూర్ణ నుంచి వారు చేసిన చివరి నాటకం వరకు ప్రతి నాటకంలో నేను కథానాయకుడు, ఆయన కథలు ఎన్నుకున్నప్పుడు  పూర్తి చరిత్ర ఆయనే సేకరించి  ఆ నాటకాన్ని సరిగా అధ్యయనం చేయగలిగిన రచయిత ఎవరని ఆలోచించి  వారికి కబురు చేసి కేంద్రానికి రప్పించి  పూర్తిగా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి  ఈ వేష పరిధి ఎంత ఉండాలి  ఈ వేషం ఇలా ప్రవర్తించాలి  ప్రధాన పాత్రలో ఎలాంటి లోపాలు కలగకూడదు  కథానాయక ప్రధానంగా లేకపోతే నాకు ఇష్టం ఉండదు  ప్రతి పాత్ర హుందాగా వచ్చి హుందాగా వెళ్ళాలి  అని చెప్పిన తర్వాత వారు రాసిన  నాటకాన్ని మళ్లీ పరిశీలించి  దానిలో మార్పులు చేర్పులు చూసి  వాటన్నిటిని సరి చేసుకున్న తర్వాత  ఆ పాత్రలకు ఎవరెవరు సరిపోతా రు అనే విషయాన్ని ముందే ఆలోచించి  నండూరి సుబ్బారావు గారిని సి రామ్మోహన్ రావు గారిని  సలహాలు అడిగి  తుది నిర్ణయం తీసుకుంటారు.
జ్ఞానపీఠ బహుమతిని తీసుకొచ్చి ఆంధ్రులకు గౌరవ ప్రతిష్టలను ఇచ్చిన  విశ్వనాథ సత్యనారాయణ గురించి  ఆయనకు బాగా సన్నిహితుడైన జరుక్ అనబడే జల సూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి గారిని పిలిచి వ్రాయమంటే  ఇంకేదైనా వ్రాస్తాను కానీ వాడి జీవితం మీద  వ్రాసే సాహసం చేయను అన్నారు  కారణం అడిగితే  వాడిది విచిత్రమైన మనస్తత్వం  చిత్రం ఏమిటంటే అన్న ఊతపదంతో  అతను ఉపన్యాసం ప్రారంభమవుతుంది  ఎదుటివారిని చులకనగా మాట్లాడినా అది  అర్థవంతంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు  నాకు దోవ ఇవ్వు అని అడిగిన వాడిని  నేను  నీకు దోవ ఇస్తాను వెళ్ళు అనే సంస్కారి అవతల వాడు అజ్ఞాని అని తెలిసిన తరువాత  తన విజ్ఞానాన్ని అనవసరంగా వృధా చేయవద్దు అనుకొనే తత్వం  ఒకవేళ నేను రాసినా ఆ వేషాన్ని ఎవరు పోషించగలరు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారా? ఆలోచించి  ఫలానా వాడు ఉన్నాడు అని చెపితే నేను తప్పకుండా రాస్తాను అన్నారు. అంతటితో ఆ ఆలోచనను విరమించుకున్నారు బందా కనక లింగేశ్వరరావు గారు.

కామెంట్‌లు