మాతృభూమి;--ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ భూమి మీద జీవిస్తున్నమానవులకు  భూమి గురించి తెలుసునా భూమి లేకపోతే మానవుని యొక్క జీవితం లేదు  ఒక పంట పండించడానికి భూమి కావాలి  అక్కడ పండిస్తేనే మనకు భోజనం  రత్నాలు మాణిక్యాలు వైడూర్యాలు ఏది కావాలన్నా అది భూమాతే ఇస్తుంది  ఏ ఖనిజం కావాలన్నా  ఏ రకమైన ద్రవం పెట్రోల్ లాంటివి  కావాలన్నా పుడమి తల్లిని ప్రార్థించ వలసినదే  రత్న గర్భ అనే పేరు  సార్థకం  అలాంటి తల్లి  భూసారాన్ని ఇస్తూ  రకరకాల మానవులకు కావలసిన ప్రతి వస్తువును  చంటి బిడ్డకు కన్నతల్లి ఎలా బిడ్డకు అడిగినవన్నీ ఇస్తుందో అలా  పుడమి తల్లి  మనకు అన్నీ అందిస్తుంది  అలాంటి అమ్మను గురించి తెలుసుకోకపోవడం, తెలుసుకోవాలని అనుకున్నా  అది భూమి తత్వం అని వాదించే వాళ్ళు ఉన్నారు.
మానవజాతి తనను గురించి తాను తెలుసుకోవడం ఈ శరీరం ఏమిటో ఆ లోపల జీవం ఏమిటో  నేను అని చెప్పుకుంటున్న  మనిషి ఆ నేను అన్న విషయాన్ని తెలుసుకుంటున్నాడా ఆ ప్రయత్నం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరో వివేకానంద రామకృష్ణ పరమహంస లాంటివాడు చెప్పినది విని కాబోలు అనుకుంటాం. అంతే తప్ప వ్యక్తిగతంగా ప్రయత్నం చేసి దానిని తెలుసుకునే ఆలోచన మనకు రాదు. తత్వము  అంటే తనను తెలుసుకోవడం  ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అది నేనే అని తెలుసుకోవడమే జీవితం. అది తెలుసుకోవడానికి శరీరం ఉండవలసినదే కదా. ధర్మాన్ని సాధించాలి అంటే శరీరమే మూలము అని బుద్ధ భగవానుడు చెప్పిన విషయం  దానిని కార్యరూపంలో పెడితే  ప్రతి ఒక్కరూ బుద్ధులే  అవుతారు. మనకు ఎవరో ఏదో చేస్తారు  అని ఎదురు చూడటం వల్ల కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయా  ఏ విషయాల గురించి తాను  తెలుసుకో దడుచుకున్నాడో దానికోసం  స్వయంకృషితో పాటు పడాలి  ఆ కృషిలో అనేక అవాంతరాలు రావడానికి అవకాశం ఉంది  ఎన్ని అడ్డంకులు వచ్చినా  తన బుద్ధిని ఉపయోగించి  దానిని దాటి  విషయపరిజ్ఞానంతో సాధించాలి. ఏదైనా మన శ్రమతోనే సాధించవచ్చు అన్నీ శ్రమలోనే ఉన్నాయని వేమన మనకు చెప్తున్నాడు. తాను కూడా ఎంతో కృషిచేసి  జీవితం మూలాలను అర్థం చేసుకున్న వాడు కనుక  మనలను కూడా అలా  పనిచేసి సాధించాలి అని చెప్తున్నాడు అందుకోసమైనా ఈ పద్యాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి మీ కోసం ఆ పద్యం.
"భూమిలోన బుట్టు భూసారమెల్లను  
తనువులోన బుట్టు 
తత్వమెల్ల  
శ్రమములోన బుట్టు 
సర్వంబు తానౌను..."


కామెంట్‌లు