కౌసల్య... నాటకంఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఒక పర్యాయం ఒంగోలు కార్యక్రమానికి వెళ్లి అక్కడ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు  పోలాప్రగడ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాం  నేను వారిని చూడడం మొదటిసారి  కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం  చక్కటి నవలలు వ్రాసిన మంచి రచయిత  మానసిక విశ్లేషణ తో కూడిన  పాత్రలను సృష్టించడం  ఆయనకు తెలిసినంతగా మిగిలిన చాలా మందికి తెలియదు  వారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు కూడా మేడమ్ తర్వాత మాకు  సకల మర్యాదలు చేసి  విశ్రాంతి తీసుకోమని చెప్పింది వారి ఇంటి దగ్గర నేను గమనించినట్లు  ఉషశ్రీ గారు వారి ఇంట్లో ఎలా ఉంటారు వీరి ఇంట్లో కూడా అలాగే ప్రవర్తించారు  భార్యా భర్తలు  కూడా కలుపుగోలుగా మాట్లాడడం  నాకు ఆశ్చర్యంగా నేర్పించండి  ఎంతో చొరవ ఉంటే తప్ప అలా మాట్లాడారు గురువుగారు  తర్వాత చెప్పారు వారి సాన్నిహిత్యాన్ని గురించి పోలాప్రగడ వారు ఉషశ్రీ గారికి  మంచి స్నేహితుడు. ఇద్దరూ ఏకవచన ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు కూడా మంచి రచయిత్రి  ఆమె కూడా రేడియో కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటుంది. పోలాప్రగడ వారు  అనేక నాటకాలను రేడియోకు కూడా రాశారు వారు ఎక్కువగా కథల మీద, నవలల మీద దృష్టి పెడతారు. వారు రాసిన నవలలో  కౌసల్య చాలా మంచి పేరు తెచ్చుకున్నది.  ఆ పుస్తకం గ్రంధరూపంలో కూడా వచ్చింది  దాన్ని చదివిన ఉషశ్రీ గారు పోలాప్రగడ ని పిలిచి  ఏరా ఇది నాటకంగా చేస్తే చాలా బావుంటుంది  ప్రయత్నం చెయ్ అన్నారు.  ఇది నవలగా మంచి ప్రాచుర్యం చెందింది రేడియోలో  నాటక రూపం అంత బిగువుగా రాదేమో అని  సందేహాన్ని వెలి పుచ్చితే  తిక్కన గారి  భారతాన్ని చదివిన వాడివి రాయగలవు అని ప్రోత్సహించారు. దాన్లో డాక్టర్ ఎన్.వి. ఆర్ సాంబశివరావు, డాక్టర్ ఇందిరా ప్రియదర్శని, కందుకూరి చిరంజీవి రావు,  నండూరి సుబ్బారావు, ఆలపాటి లక్ష్మి రాజకుమారి, ఏలూరు శాంతాదేవి నటించడం విశేషం. డాక్టర్ ఇందిర గొంతు చక్కగ శృతి పక్వంగా ఉంటుంది  ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉంటుంది  గుంటూరు లో వైద్య వృత్తిలో ఉన్నారు.  అవకాశం వచ్చి  కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడ వైద్య వృత్తిలో ఉన్నారు  కందుకూరి చిరంజీవి రావు గారు బందా కనక లింగేశ్వర రావు గారికి రంగస్థలం మీద సహనటుడు వేదికపైన ధర్మరాజు పాత్ర ఎంత గొప్పగా పోషిస్తారో నిజజీవితంలో కూడా  ఆయన ధర్మరాజే. ఇంకా నండూరి సుబ్బారావు గారు జగమెరిగిన హాస్యనటులు. ఆలపాటి లక్ష్మి రాజకుమారి ఇద్దరూ కూడా రంగస్థలం మీద పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు.  ఏలూరు శాంతా దేవి డాక్టర్ రాజారావు గారి దగ్గర  మంచి  రంగస్థల నటిగా తీర్చిదిద్ద బడింది. వీరందరి సహకారంతో నాటకం చాలా చక్కగా వచ్చింది. 

కామెంట్‌లు