జయానంద రావు కథ...;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో చేరి నిలయ విద్వాంసుల పరిచయం అయిన తర్వాత బయట నుంచి వచ్చిన జడ జయానంద రావు గారు వారి గ్రామం నుంచి నాతో స్నేహం చేయడానికి ఈ ఊరు వచ్చి స్టూడియోలో కలిసి ఆయన మనసులోని మాట బయట పెట్టాడు. నాకున్న తక్కువ మంది మిత్రులలో వారు కూడా ఒకరుగా చేరారు. నా కన్నా చాలా పెద్దవాడు చాలా హుషారుగా ఉంటాడు చాలా విషయాల మీద అవగాహన ఉన్నవాడు నా అభిమాని  ఒక రోజు నాటకం రాసి తీసుకువచ్చి హరివిల్లు అని నాటకానికి పేరు పెట్టాను ఇది సరైనదో కాదో మీరే నిర్ణయించాలి అన్నాడు  మనుషులలో ఉన్న కోరిక ఏ విధంగా హరివిల్లులోని రంగులలాగా మారిపోతూ వుంటుందో అది చెప్పడం కోసం  దీన్ని రాశాడు  చదివిన తర్వాత  పేరు సరిగ్గా సరిపోయింది అని చెప్పాను.
అయితే ఈ నాటకంలో ప్రధాన పాత్ర నిర్వహించి  మిగిలిన వారితో ఈ కార్యక్రమాన్ని మీరే నిర్వహించాలి అన్నారు.    కాకినాడ నుంచి ఉద్గళా సుబ్బారావు, కళింగపట్నం నుంచి బి రామచంద్ర రావు, మధు పట్నాయక్  విశాఖపట్నం నుంచి ఏ రాజేశ్వరరావు (రంగ స్థల నటుడు, దర్శకుడు శివ రామ రెడ్డి గారి కుమారుడు), కుమారి ఆర్ శాంతి (రంగ స్థల నటుడు, ఆర్ కుమార రాజ కుమార్తె) వాళ్లతో రిహార్సల్స్ రికార్డింగ్ డబ్బింగ్ అయ్యేంతవరకు కూడా ఆయన నా ప్రక్కనే ఉండి కావలసిన సకల సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు  తరువాత మా ఇంటికి వచ్చి నా శ్రీమతి ని పరిచయం చేసుకొని  ఆనంద్ గారు నా నాటకానికి  ప్రాణం పోశారమ్మా అని ఎంతో ఆనందంగా చెప్పారు  మా దంపతుల్ని వారింటికి ఆహ్వానించారు.
ఆవిడ రాదులే నేను వస్తానని  చెప్పాను. అప్పుడు జయనంద రావు గారు మన నాటకంలో నటించిన నటీనటులను సాంకేతిక సలహాదారులను కూడా ఆహ్వానిస్తే చాలా బాగుంటుంది సార్ నా శ్రీమతి కూడా చాలా ఆనందిస్తుంది అని చెప్పిన తర్వాత ఒక రోజున మేమంతా వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చాము. అలాంటి మంచి మనుషులతో నాకు పరిచయం వుండడం రేడియో నాకిచ్చిన అవకాశం.


కామెంట్‌లు