ఆశబోతు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 మానవ జీవన చక్రం ఎటు నుంచి ఎటు వెళుతుందో ఎవరూ ఊహించలేరు. ఆనాటి వేమన నుంచి ఈనాటి వరకు మనుషుల మనస్తత్వాలలో ఏ విధమైన మార్పు వచ్చిన దాఖలాలు లేవు. రేలంగి పేరుతో ఉన్న రేలంగి వెంకట రామయ్య గారు విజయవాడ వచ్చి  పిచ్చి లక్ష్మితో  నాటక ప్రదర్శన చేసినప్పుడు  వివరాల కోసం నేను హోటల్ కి వెళ్లాను. ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దాని నిండా ఉప్మా పెట్టించుకుని నాకు కూడా ఒక ప్లేట్ తెప్పించారు  నేను తినడం అయిపోయినా కానీ ఆయన  తినడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తినలేదు  ఏంటండీ అని అడిగితే  ఆయన ధోరణిలో  నాయనా  నేను మద్రాస్ వచ్చిన కొత్తలో  భోజనానికి కూడా లేకుండా ఇబ్బంది పడ్డాను మరమరాలతో కడుపునింపుకున్నాను  ఈ రోజున లక్షలకు లక్షలు సంపాదించి  కొండమీద కోతిని కూడా కొనగలిగిన స్థితికి వచ్చాను. ఈ రోజున బంగారపు అంశతో బంగారాన్ని కూడా తినగలిగిన ఆస్తి ఉంది  కానీ తిన్నది జీర్ణించుకునే శక్తి లేదు  ఆ బీదరికంలో తిని జీవించిన మరమరాలే గతి. ఇప్పుడు నేను ఏమైనా తింటే ఆసుపత్రికి వెళ్ళవలసినదే అని పకపకా నవ్వారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా రావడం కోసం  అత్యవసరమైన వ్యక్తులకు  వారు జీవించడానికి  సాయపడవచ్చు కదా అని అడిగాను  నిజమే, నాకూ అలాగే అనిపిస్తుంది పాపం కడుపు మండిన వాడికి కడుపు నింపితే  వారికి ఎలా ఉన్నా నాకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది  అనిపించి చాలా సార్లు ప్రయత్నం చేశాను సహాయం చేద్దామని. ఆ డబ్బును చూసేసరికి  నేను పడ్డ కష్టం జ్ఞాపకం వస్తుంది  విపరీతమైన వేడిగా ఉన్న లైట్ల మధ్య  బయటకు వెళితే విపరీతమైన ఎండలో  చెప్పులు కూడా లేకుండా ఇసుకలో నిలబడి చేయవలసిన పరిస్థితి
ఆ కష్టం నాకు జ్ఞాపకం వస్తుంది  దానితో ఆ డబ్బు మళ్ళీ లోపల పెట్టేస్తాను అది స్వార్థం అని నాకు తెలుసు  కానీ మనసు అంగీకరించదు  అది నా బలహీనత కావచ్చు  అనే ఆధ్యాత్మిక చింతనలో పండిపోయిన వాడు చెప్పిన మాటలను చెప్పారు  ఒక హాస్యనట చక్రవర్తి అలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్య వేసింది మరి ఆ ధనాన్ని ఆయన జీవిత చర్మాంకంలో ఉపయోగించుకున్నారా?  సద్వినియోగం అయిందా? అంటే  కాలేదని చరిత్ర చెప్తుంది. చివరి దశలో ఎలా జీవించారో అందరికి తెలిసిన విషయమే  అలా మనిషికి ఎంత కావాలో అంతవరకే సంపాదిస్తే వాడు చాలా ఆనందంగా ఉంటాడు. లేకపోతే బాధల పాలవుతాడు అని చెప్పడమే వేమన అభిప్రాయం. ఆ పద్యాన్ని చదివితే మీరు కూడా అదే అభిప్రాయానికి వస్తారని నా అభిప్రాయం.


"దానములను జేయ ధర చేతులాడక  
బహుధనంబు గూర్చి పాతిపెట్టి  తుదను దండుగనిడి  మొదలుగా చెడు నట్టు..."


కామెంట్‌లు