హేమకార విద్య;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 రాజవంశంలో పుట్టిన వేమన ఏది కావాలనుకున్నా  క్షణాల్లో పొందగలిగిన సత్తా కలిగిన వాడు  కన్నతల్లి చిన్నతనంలోనే  భౌతికంగా తనకు దూరమైనా ఆ మాతృ  హృదయాన్ని తన వదిన  ద్వారా తల్లి ప్రేమను పూర్తిగా అనుభవించినవాడు. వదిన వడిలో గారాంగా పెరిగిన వాడు. ఏ ఆలోచనలు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు  మెదడు రకరకాల ఆలోచనలు రేపుతుంది  అది చెప్పేవన్నీ చెడు ఆలోచనలు తప్ప  మంచి చేయమని సమాజానికి హితవు చెప్పమని ఎక్కడ  ప్రబోధించదు.దానితో అతని చుట్టూ  దురాలవాట్లకు లోనైన స్నేహితులు దొరుకుతారు. వారి ద్వారా కొంతమంది జార కాంతుల  స్నేహం మొదలవుతుంది  దానితో జీవితం పతనావస్తకు దారితీ స్తుంది  ఒక చెడు అలవాటు వుంటేనే  భరించలేం  అలాంటిది అనేక అలవాట్లకు లోనైతే చెప్పేదేముంటుంది.
వేమన జీవితంలో అతి దగ్గరగా ఉన్న ముఖ్య స్నేహితుడు అభిరామయ్య  అతను కంసాలి బంగారం పనులు చేయడంలో నేర్పరి  పరశువేది రహస్యం తన దగ్గర ఉన్నదని నమ్మించి  ఈ ప్రపంచంలో ధనం లేకుండా ఏ పని మనం చేయలేం  అది మన చేతిలో ఉన్నప్పుడు  దేనినైనా సాటించవచ్చును అని నమ్మబలికి  అనేక ప్రయోగాలను చేసి  ఆ వచ్చినది వేమనకు అందజేస్తానని చెప్పి చివరకు రిక్త హస్తాలతో మిగిలిపోయాడు. వేమనకు అది  జీవితంలో మొదటి ఓటమి  తర్వాత  వేమన మోహించిన  అందమైన జాణ పేరు విశ్వద. ఆమె వలలో పడి  తన వయసు తో పాటు  చేతిలో ఉన్న సొత్తు మొత్తం  పోగొట్టుకొని చివరకు విశ్వద కూడా వేమనను బయటకు గెంటేసే స్థితికి రావడం  తన జీవితంలో రెండవ ఓటమి.
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత అనుభవం వస్తుంది దానితో జీవితం సక్రమంగా వెళుతుంది అని మన పెద్దలు మనకు చెప్పిన సూక్తి బంగారాన్ని తయారు చేసి తన చేతిలో పెట్టుకుంటే  ఏ పనినైనా స్వయంగా చేయవచ్చు అనుకుంటాం. అలాగే ఆ విద్య నేర్చినవాడికి సమాజంలో అసాధ్యం అనేది ఏదీ లేదు  తన సృజనతో  ఏ విషయానైనా అయినా కూలంకషంగా ఆలోచించి  లోతైన అర్థాలను వెలికి తీసి  ఎంతోమందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తిగా తయారవుతాడు. తన వ్యక్తిగత అనుభవంతో ఎన్నో ఢక్కా ముక్కలు తిన్న వ్యక్తి అన్ని రకాల వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులను  పరిశీలనగా దగ్గర ఉండి చూసిన తర్వాత  ఈ భౌతిక సుఖాలకు రోచి ప్రతి మానవుని నాలుక పైన నడయాడే అద్భుతమైన నీతులను ఆటవెలదిలో చెప్పిన మొనగాడు వేమన.  వారి ఒకానొక అనుభవం ఈ పద్యంలో చూడండి.

"హేమ కారవిద్య నెరిగిన వారెల్ల 
వెతల బడని యట్లు విద్య చేత తత్వమెరుగు వెనక  చింతేలరా..."


కామెంట్‌లు