కుక్క బుద్ధి;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవ జీవితంలో అసూయ అనేది ఒక గొప్ప జబ్బు దానికి   లింగభేదం లేదు, వయసుతో సంబంధం లేదు  ఏనుగు వెళుతూ ఉంటే కుక్క మొరుగుతూ ఉంటుంది.  దానిని ఏనుగు పట్టించుకుంటుందా అలాగే  జీవితంలో నిజాయితీగా  స్వయంకృషితో  ధనాన్ని సంపాదించి తను ఒక మంచి వస్తువు కొంటె దానిని చూసి అసూయపడేవారు ఎంతమంది ఉంటారు. మన కన్నా మంచి స్థితిలో ఉన్న వాళ్లు కొంటూ ఉంటే మనకు ఎలా ఉంటుంది అసూయ పెరుగుతుంది. ఇది మానవ నైజం దానిని ఎవరూ మార్చలేరు. ఈ తరతమ భేదాలు అనేవి మనం సృష్టించుకున్నవా లేక ప్రకృతిలోనే ఇవ్వన్నీ ఉన్నాయా? ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు  రక్తంలో ఉన్న బలహీనత ఓర్చ లేని తనం  ఎవరైనా కొత్తగా వచ్చిన వారిని చూసినా, గుర్రం మీద ఎవరైనా వెళుతున్నా కొత్త కారు కనిపించినా మొరగడం కుక్కకు అలవాటు. దానిది అసలే దొంగ బుద్ధి కదా వీరు కూడా దొంగతనంగా వచ్చారని దాని భావన. ఏదైనా పని మీద గాని  సరదాగా షికారుగా కానీ  గుర్రం మీద వెళుతూ ఉంటే కుక్క మొరుగుతుంది  కారణాలు దానికే తెలియాలి  ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా మొరగడం దాని సహజ లక్షణం. ఈ లక్షణాలను వర్ణిస్తూ ప్రజాకవి వేమన కొత్త కోణాలు మనకు  తెలియజేస్తున్నారు. ఉత్తమ జీవితాన్ని గడిపే వ్యక్తిని నీచ మానవులు వారి జీవితంలో గెలవలేరు అలా అని ఓటమిని అంగీకరించరు. దానితో అనేక రకాలైన పుకార్లను వెతికి వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. ఆత్మన్యూనతా భావంతో చేసే అల్లరి చిల్లరి పనిగా దానిని వర్ణిస్తారు పెద్దలు. అంత మాత్రం చేత ఆ పెద్ద మనిషి గౌరవ మర్యాదలకు ఏమైనా లోపం జరుగుతుందా? వారికున్న గౌరవం పెరుగుతుంది తప్ప  తరగదు నీ ప్రవర్తన వల్ల  అతని మాటలను ఏ ఒక్కరు లెక్కచేయరు. కొన్ని ప్రాంతాలకు వాహనాలు వెళ్లలేని దుస్థితి  ఆ పరిస్థితుల్లో గుర్రం మీదే వెళ్లడం  తప్పనిసరి  అలాంటి వ్యక్తులను కూడా దూషించే  వారు వుంటే తెలివైన వాళ్లకు  ఆ పద్ధతిని మార్చుకోమని సున్నితంగా చెప్పడం కోసం  ఈ పద్యాన్ని వ్రాసి మన ముందుంచారు. ఒకసారి చెప్పి నంతమాత్రాన అతని మనసు మారుతుందా అంటే  మారదు కానీ చెప్పవలసిన బాధ్యత  కవులకు రచయితలకు ఉన్నది  దానిని సక్రమమైన పద్ధతిలో చెప్పితే  కొంతవరకైనా మారుతా రేమో నన్న  అభిప్రాయంతో చెప్పడం మారకపోతే అది అతని కర్మ అనుకోవడం. ఆ పద్యాన్ని మీరూ చూడండి.
"జిక్కి నెక్కి వీధి జక్కగా వె లువడ 
కుక్క వెన్ను తగిలి కూయదొర కు  
గనున కోర్వలేని కాపురుషులు నిట్లె..."


కామెంట్‌లు