అమ్మ అనురాగం;-డా.నీలం స్వాతి,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811961.
 జీవిత అనుభవం కలిగిన పెద్దది అద్భుతమైన సూక్తిని చెప్పారు మానవుడు ఆశతో తనకు కావలసిన దానిని సాధించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కొన్ని చోట్ల భగ్నం కావచ్చు మరి కొన్ని చోట్ల విఫలం కావచ్చు ఏ కార్యం జరగాలన్న మానవ ప్రయత్నంతో పాటు ప్రకృతి లేదా దైవ కృప అవసరం అది లేకపోతే మనిషి ఎందుకు పనికిరాడు అని చెబుతూ  నీకు బాగా ఇష్టమైనది కావాలనుకున్నావు  దురదృష్టం వెంబడించి నీకు కావలసినది దొరకకుండా  దానికి సరిపడినది మరొకటి దొరికే అవకాశం ఉంటే  ఇష్టమైన దానిని ఎంత అందంగా ఆస్వాదిస్తావో అనుభవిస్తావో అలాగే నీ చేతికి అందిన దానిని కూడా అంత అందంగా ఆస్వాదిస్తూ అనుభవించు వినడానికి బాగానే ఉంటుంది కానీ చేయడానికి మనసు అంగీకరిస్తున్నదా.
ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవచ్చు  ఒకరికి తీపి ఇష్టమైతే మరొకరికి కారం ఇష్టం అలా కాకుండా  వగరుకాయ తింటే ఇంకా బాగుంటుందని మరికొందరు  అందుకే లోకో భిన్న రుచిః అన్నారు  ఒకరిని చూసి మరొకరు మార్చుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి కనిపించదు  మరి ఈ ఇంటి ఇల్లాలు ఏం చేయాలి దేశంలో ఎన్ని కూరలు ఉన్నాయో అన్నిటినీ తీసుకువచ్చి గృహస్తు ఇంటిలో పెట్టినా అవన్నీ వండడం కుదరదు కదా రోజుకు ఎన్ని కావాలి  పప్పు, కూర, చారుతో పాటు మజ్జిగ, పెరుగు  కానీ  ఉంటే సరిపోతుంది మరి మిగిలిన కూరలన్నీ ఆవిడ ఏం చేస్తుంది  ఆ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు రకాల రుచులకు అలవాటు పడి ఉంటాడు కదా  అందరి రుచులకు ఒకే రోజు సంతృప్తి పరచగలదా  ఆ గృహిణి  అందుకని ఆమె అందరినీ సంతోషపచ్చడానికి  ఏం చేస్తుందో చూద్దాం. ఎంత లేదన్నా గృహిణికి ఆడపిల్ల మీదే మనసు ఉంటుంది కదా  ఆ పాపకు బంగాళాదుంప కూర చాలా ఇష్టము, భర్తకు  దోసకాయ, కుమారరత్నానికి  వంకాయతో కూడిన  ములగ కాయ ఇవన్నీ గమనించి గృహిణి  మొదటిరోజు దోరగా కాలిన  బంగాళాదుంపల కూర చేస్తుంది, రెండవ రోజు బాగా ఉల్లిపాయలు వేసి  అందంగా తయారు చేస్తుంది, మూడవ రోజున దుంపలో దోసకాయ వేసి  భర్త రుచికి అనుగుణంగా చేస్తుంది  చివరి రోజున అందరికీ కలిసి వచ్చేలాగా  దుంపలో దోసకాయ వంకాయ  ములగ కాయలతో కలిపి కలగలుపు కూర చేసి పెడుతుంది  ఆ కుటుంబంలో ఒకరంటే మరొకరికి ప్రేమ అభిమానాలు ఉన్నాయి కదా కనుక అమ్మ ఎవరికి ఇష్టమైనది చేసినదో అతనిని తలుచుకుంటూ మిగిలిన వారు ఆ కూరను ఆస్వాదిస్తారు  కనక అమ్మ దృష్టి సమదృష్టి  ఆమె మనసులో  అందరికీ స్థానం ఉంటుంది ఏ ఒక్కరిని దూరంగా ఉంచదు  అందుకే ఆమెను ధర్మపత్ని అని పిలుస్తారు.అలాంటి అమ్మలు 
ఉండడం అదృష్టం కదూ... కనుక పిల్లలూ అమ్మ ఏదీ చేసినా తినడం అలవాటు చేసుకోండి.



కామెంట్‌లు