వర్తమానంలో జీవితం;-సి హెచ్ ప్రతాప్ ; -సెల్ ; : 95508 51075
 జరిగిన సంఘటనలను గూర్చి చింతిస్తూ, జరుగబోయే వాటి గురించి ఆందోళన చెందుతూ , వర్తమానాన్ని వృధా చేసుకొనే వారని అవివేకులని అంతారు. ఎందుకంతే సర్వ శాస్త్రాల సమాహారం వర్తమానం బహు అమూల్యం,భూత కాలం చెల్లని నోటు వంటిది, భవిష్యత్తుకు వర్తమానం లో విలువ లేదు అనే చెబుతున్నాయి.
గతం లో చేసిన పొరపాట్లను విశ్లేషించుకొని తద్వారా విలువైన పాఠాలను నేర్చుకొని, భవిష్యత్తులో సాధించబోయే పనులకు నిర్ధిష్ట ప్రణాళికలు వేసుకొని, నిర్ధుష్టమైన లక్ష్యాల నేర్పాటు చేసుకొని,  వర్తమానం లో శ్రమించడమే విజయ సూత్రం అన్నది జగద్విదితం.
నిన్న లేదు , రేపు రాదు మనకు మిగిలినది నేడు మాత్రమే అన్న సూక్తిను బాగా  ఒంటబట్టించు కోవాలి.సంతోషం, సౌందర్యం, ఆనందాలను అనుభవించడానికి   వర్తమానం లో జాగృదావస్థలో జీవించడం అత్యావశ్యకం. ఎడ తెగని వల్లమాలిన ఆలోచనలు,  మానవులకు వర్తమానం లో జాగృదావస్థలో జీవనానికి అవరోధాలు. ధ్యానం, యోగం ల ద్వారా మనసును నియంత్రించుకోవడం వర్తమానం లో జీవించుటకు కృషి చేయడం మన తక్షణ కర్తవ్యం.
ఇక ప్రజల ఆలోచనా విధానం చిత్రంగా వుంటుంది.ఎంతసేపూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు. మన ముందున్న కాలం ఏమిటో తెలుసుకోరు. ఉన్న కాలం గురించి ఆలోచించరు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. అందుకే అనుభవజ్ఞులనే మాట ఇదే.. ఈరోజు ఈ క్షణంలో చెయ్యవలసిన దానిని ఆచితూచి చెయ్యడంలో చైతన్యవంతులై ఉండాలి.


కామెంట్‌లు