అందమైన దేవాలయం బడి గా మన కవులు వర్ణిస్తారు. జీవితం లో ఎదిగేందుకు మహోన్నతమైన వ్యక్తిత్వం సాధించేందుకు భౌతికమైన కోర్కెలను తీర్చుకునేందుకు కావాల్సిన అర్హతలను అందించేది బడి . బడి ప్రభావం మనపై ఇంతింత కాదయా ! అ, ఆ లు దిద్దించే స్థితి నుండి పి హెచ్ డి వంటి ఉన్నతమైన డిగ్రీ లను అందించు పరమ పవిత్ర దైవ సన్నిధానం బడి.
మానవ జీవితాన్ని తీర్చి దిద్దే ఇటువంటి పవిత్ర దేవాలయంతా సమానమయ్యే బడిని అపవిత్రం చేయడం క్షమించ రాని నేరం. బడి ప్రాంగణంలోనే ప్రేమ కలాపాలు, అత్యా రాలు,దౌర్జ్యనాలు, లైంగిక వేధింపులు మితి మీరి పోవడం శోచనీయం. చదువుల తల్లి సరస్వతికి వ్యధ కల్గించడం బాధాకరం. మానవులను మహనీయులుగా తీర్చే జీవితం లో మహోన్నతమైన శిఖరాలను అధిరోహింపజేసే బడి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది
బడియే మనకందరకు గుడి .
దేశమైనా, రాష్ట్రమైనా ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే నైపుణ్యం గల మానవ వనరులు కావాలి. అది విద్యతోనే ముడిపడి ఉంటుంది. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యను బట్టే రేపు భవిష్యత్లో మానవ వనరుల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభుత్వం బడులను డెవలప్చేయడంతోపాటు, విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలి. టీచర్లు కూడా ఏకోన్ముఖ లక్ష్యంతో, జవాబుదారితనం తో పని చేయాలి. బోధనలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా తగిన వృత్యంతర శిక్షణ ఉండాలి. ఆ మేరకు ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందడుగు వేయాలి. ప్రాథమిక తరగతులకు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ఉన్నత తరగతులకు సబ్జెక్టుకు కనీసం ఇద్దరు టీచర్లను నియమిస్తే విద్యా ప్రమాణాలు వికసిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి. నిరంతర తనిఖీలు, పర్యవేక్షణ కోసం విద్యాధికారులను ఎప్పటికప్పుడు నియమించాలి. దేశ భవిష్యత్తును నిర్దేశించే పాఠశాల విద్యా వ్యవస్థలో లోపాలు, విద్యా ప్రమాణాల పతనం ఫలితాలు రేపటి సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.
సి హెచ్ ప్రతాప్
హైదరాబాద్ 500 062
గుడి తో సమానమైన బడి--సి.హెచ్.ప్రతాప్;-సెల్ : 95508 51075
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి