పుస్తక నేస్తాలు:-;-మీసాల సుధాకర్,-పి.జి.టి-తెలుగు,-ఖిలాషాపురం,-జనగామ జిల్లా,9908628430

 పుస్తకాలు చదివితే
రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది.
పుస్తకాలు చదివితే గొప్ప వ్యక్తిని కలిసినట్లుగా అనిపిస్తుంది.
పుస్తకాలు చదివితే
ఆలోచన శక్తి పెరుగుతుంది.
పుస్తకాలు చదివితే
మానసిక వికాసం కలుగుతుంది.
పుస్తకాలు చదివితే
మానవతా విలువలను నేర్పుతాయి.
పుస్తకాలు చదివితే
ప్రగతికి దారులను చూపుతాయి.
పుస్తకాలు చదివితే
అభివృద్ధికి బాటలు వేస్తాయి.
పుస్తకాలు చదివితే
మరో లోకానికి తీసుకు వెళుతాయి.
పుస్తకాలు చదివితే
మేధావులను తయారు చేసస్తాయి.
మంచి పుస్తకం చదవడం వలన మనసుకు ఉత్తేజం కలుగుతుంది.
మానసికంగా కుంగిపోయిన మనసుకు ఉత్సాహాన్నిస్తుంది.
పుస్తకాలు చదవాలి- మస్తకాలు మెరవాలి.
అజ్ఞానం తొలగాలి-విజ్ఞానం పెరగాలి.
పుస్తకాలు నేస్తాలు-నేర్పించును పాఠాలు.
బోధించును నీతులు-చూపించును దారులు.
కామెంట్‌లు