విభూతి మహిమ;-శంకరప్రియ., శీల.,--సంచారవాణి: 99127 67098
 👌సాంబశివుని విభూతి
కలిగించును సంపద!
    తొలగించును ఆపద!
శంకర ప్రియులార!
    (శంకర ప్రియ పదాలు.,)
👌"విభూతి" అనగా భస్మము, ఐశ్వర్యము! అని, అమరకోశము పేర్కొను చున్నది! శ్రీకరమైనది.. విభూతి! పావనమైనది.. విభూతి! దీనిని.. తారక మంత్రమైన "ఓం" కారంతో; శ్రీశివ పంచాక్షరి, అష్టాక్షరి, మృత్యుంజయ మంత్రములతో.. అభిమంత్రించి; "విభూతి ధారణ" చేయాలి!
👌భక్త మహాశయులకు.. విభూతి ధారణ వలన.. సకల శుభములు, భూరి సంపదలు.. సమకూరును! అట్లే, సర్వగ్రహ బాధలు, ఆపదలు నివారించును! అట్లే, బ్రహ్మ, విష్ణువు.. మున్నగు దేవత లందరూ "విభూతి మహిమను" అభివర్ణింప లేకున్నారు! కనుక, సాధకులార! సకల శుభములు, జయములు నొసంగు; "విభూతి"ని ధరించండి!  శ్రీరస్తు శుభమస్తు!
       🚩మత్త కోకిల పద్యము
     భూతిధారణ సేయు భక్తులు, భూరికీర్తిని పొందెడిన్
     భూతిధారుడు శంభు డీశుడు, భూరి సంపద లిచ్చెడిన్
    ప్రీతిదాయక మెల్లవారికి, కీర్తికారక మయ్యెడిన్
     ఆతురమ్ములు పోవు సత్యము, నార్తిభంజక మయ్యెడిన్!
       (ఆతురమ్ములు అనగా.. బాధలు)
   (రచన: డా. వేదాల గాయత్రీ దేవి.,)

కామెంట్‌లు