భస్మాసుర హస్తముశంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098
 🙏వరము నొసఁగు హరునకు
 ద్రోహము తలపెట్టుట!
      భస్మాసుర హస్తము!
ఆత్మ బంధువు లార!
🙏చేరదీయు నరునకు
వెన్నుపోటు పొడుచుట!
     భస్మాసుర హస్తము!
ఆత్మ బంధువు లార!
(ఆత్మబంధు పదాలు., శంకరప్రియ.,)
👌భస్మాసురుడు.. ఒక దానవుడు! దురాలోచన కలవాడు! ఆ మూర్ఖాగ్రేసరుడు... వరము నిచ్చిన, భోళా శంకరుని నెత్తిపైననే; తన "భస్మాసుర హస్తము" పెట్టవలెనని; ఆకాంక్షించాడు! తన ద్రోహబుద్ధి వలన, చిట్టచివరకు.. తానే సర్వనాశన మైనాడు, భస్మాసురుడు!
👌ఈ పురాణగాథ లోని "భస్మాసురులే"..  నేడు తిన్న ఇంటి వాసాలను లెక్కపెట్టే ప్రబుద్దులు!  అడుగడుగునా నమ్మించి మోసగించు  ద్రోహులు! ఆ భస్మాసురుల విషయములో జాగరూకతతో ఉండండి!  అని హెచ్చరించు చున్నదీ భస్మాసుర గాథ!
       తస్మాత్ జాగ్రత్త!
           🚩మత్తేభము
       మును భస్మాసుర దానవాధముఁడు నిన్ బూజించి హస్తంబు నె
       వ్వని శీర్షంబున నుంప భస్మమగుటన్ వాంఛించె, నీ వా వరం
         బును గారుణ్యము పొంగ నిచ్చితివె; యా మూర్ఖుండు నీపైనఁ జే
        తినిఁ బెట్టంగను వచ్చె, బేలతనమే తెల్లంబుగా! శంకరా!
 
(..శంకర శతకము., "సమస్యాపృచ్ఛక చక్రవర్తి" కంది శంకరయ్య.,)

కామెంట్‌లు