ఆంటీ బయాటిక్స్ ( Antibiotics);- ప్రమోద్ ఆవంచ 7013272452

 మానవ శరీరంలోని ప్రతి అవయవం,అది పని చేసే పద్దతినీ పరిశీలిస్తే, ఎంతో అద్భుతంగా ఉంటుంది.ప్రతి ఒక్కరి శరీరంలో ఒక డిఫెన్స్ మెకానిజమ్ అంతర్లీనంగా
పనిచేస్తుంది, దానినే ఇమ్యూనిటీ కూడా అంటారు.ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏ చిన్న గాయమైనా, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది.అంతే కాకుండా సర్జరీల తరువాత కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది.అప్పుడు ఊండు హీల్ కావడానికి డాక్టర్లు ఆంటీ బయాటిక్స్ వాడుతుంటారు.ఈ వారం ఆంటీ బయాటిక్స్ అవేర్ నెస్ వీక్....
ఈ సందర్భంగా ఆంటీ బయాటిక్స్ గురించి రాయాలనిపించింది.
                    మామూలుగా ప్రతి ఒక్కరూ వైరస్, బాక్టీరియా,ఫంగల్ ఇన్ఫెక్షన్ లతో బాధపడుతుంటారు.మన దేశంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి.వాటిని నివారించడానికి ఆ ఆంటీ వైరల్స్ డ్రగ్స్ ఉపయోగిస్తారు.బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు ఆంటీ బయాటిక్స్ ను,ఫంగల్ ఇన్ఫెక్షన్ కి
 ఆంటీ ఫంగల్ డ్రగ్స్ లను ఉపయేగిస్తారు.
            
            అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే బ్రిటీష్ శాస్త్రవేత్త 1928 సంవత్సరంలో,లండన్ లోని సేయింట్ మేరీస్ హాస్పిటల్ లో మొట్టమొదటి ఆంటీ బయాటిక్ పెల్సిలిన్
ను,పెల్సిలీయమ్ నొటాటమ్ నుంచి కనుగొన్నాడు.
43 సంవత్సరాల ఆల్బర్ట్ అలెగ్జాండర్ అనే పోలీసుకి ముఖం మీద ఇన్ఫెక్షన్ అయి,అంతా వ్యాపించడంతో
మొదటి సారి పెన్సిలిన్ తో ట్రీట్మెంట్ తీసుకున్నాడు.
కమర్షియల్ గా ఫస్ట్ అందుబాటులోకి వచ్చిన ఆంటీ బయాటిక్,సల్ఫొనమైడ్ గ్రూపుకు ప్రోంటోసిల్.దీనిని జర్మన్ బయో కెమిస్ట్ర్ గెర్ హార్డ్ డోమెగ్ డెవలప్ చేసాడు. 
      ఆంటీ బయాటిక్ ఒక కెమికల్ సబ్ స్టాన్స్.
అది బాక్టీరియాను చంపడమే కాకుండా, దాని అభివృద్ధిని కూడా ఆపుతాయి.దానినే బాక్టీరియో సైడల్, బాక్టీరియో స్టాటిక్ అని పిలుస్తారు.గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగెటివ్,అనరోబిక్,ఆరోబిక్,బ్రాడ్ స్పెక్ట్రమ్,నారో స్పెక్ట్రమ్, ఇలా రకరకాల లక్షణాలు ఉన్న బ్యాక్టీరియాలు మనుగడలో ఉన్నాయి.
ఆంటి బయాటిక్స్ వర్గీకరణను, పరిశీలిస్తే,మొదటి స్థానం పెన్సిలిన్ ది కాగా,ఫ్లోరో క్వినొలాన్స్,సెఫలోస్పోరిన్స్, నైట్రో ఇమ్మిడజోల్స్,గ్లైకో
పెప్టైడ్స్,ఆక్సోజోలిడినోన్,కార్బోపెనిమ్స్,అమైనోగ్లైకోసైడ్స్, మాక్రోలైడ్స్,మొదలయినవి ఉన్నాయి.ఫ్లోరో క్వినొలాన్స్ గ్రూపులో సిప్రోఫ్లాక్ససిన్,ఓ ఫ్లాక్ససిన్,మోక్సి ఫ్లాక్ససిన్,జెమిఫ్లాక్ససిన్,అమైనోగ్లైకోసైడ్స్ లో జెంటామైసిన్,అమికాసిన్,ప్లాజోమైసిన్,ఆక్సజోలిడిన్స్ లో లినేజోలిడ్,సెఫలోస్పోరిన్స్ లో సెఫలాక్జిన్,సెఫజోలిన్,సెఫడ్రాక్సిల్,సెఫక్లోర్,గ్లైకోపెప్టైడ్ లో వాంకోమైసిన్,టీకోప్లానిన్,రామోప్లానిన్, నైట్రో ఇమ్మిడజోల్స్ లో మెట్రోనిడజోల్,టినిడజోల్,సెక్నిడజోల్,మైక్రోలైడ్స్ లో ఎరిత్రోమైసిన్,అజిత్రోమైసిన్,రాక్సిత్రోమైసిన్,క్లారిత్రోమైసిన్ లు... ఇన్ని రకాల ఆంటీ బయాటిక్స్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయి,వాటిని పేషెంట్లు విచ్చలవిడిగా వాడుతున్నారు.
నా ఉద్దేశ్యం విచ్చలవిడిగా ఆంటీ బయాటిక్స్ వాడకం 
క్రమబద్దీకరణ కావాలని.
                      మామూలుగా ఇండియాలో ఎక్కువ శాతం వైరల్ ఇన్ఫెక్షన్ లు, మాత్రమే వస్తుంటాయి,
 కానీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ కి ఆంటీ బయాటిక్స్ వాడుతున్నారు, అది ఎంతవరకు సమంజసం.నిజంగా ఎవరికైనా బాక్టీరియల్
 ఇన్ఫెక్షన్స్ వస్తే,ఆ గ్రడ్స్ పనిచేయవు.వారికి రెసిస్టెంన్స్
 డెవలప్ అవుతుంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ ఆధిపత్యం అధికంగా కొనసాగుతోంది.వాళ్ళ ఉద్దేశ్యంలో, వచ్చిన పేషెంట్లకు సత్వరమే జబ్బు తగ్గాలంటే,వాళ్ళ మిడి మిడి జ్ఞానంతో,హై ఎండ్ ఆంటీ బయాటిక్స్ వాడాలి అని అనుకుంటారు.
అది ఏమాత్రం సరైన పద్దతి కాదనేది నా అభిప్రాయం.
ఆర్ఎంపీ వ్యవస్థను అరికట్టడంలో, ప్రభుత్వం విఫలమైంది,ఇది నిజం.ఎవరైనా పేషెంట్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరకు చూపించుకోవడానికి వచ్చినప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కించండి, ఇంజక్షన్లు ఇవ్వమనీ ఒత్తిడి చేస్తారు.సదరు డాక్టర్ మీకు ఇప్పుడు మీకు ఫ్లూయిడ్స్ అవసరం లేదని చెప్పినా వాళ్ళు వినిపించుకోరు.తప్పకుండా ఫ్లూయిడ్స్ పెట్టాల్సిందే,లేకపోతే ఆ డాక్టర్ మంచి డాక్టర్ కాదని వాళ్ళ నమ్మకం.అది పేషెంట్ల మెదడులో,నాటుకపోవడానికి కారణం ఆర్ఎంపీలు,వాళ్ళను డాక్టర్లు అని పిలవడానికి కూడా మనసొప్పడం లేదు.ఎందుకంటే వాళ్ళు కాదు కాబట్టి.
                 ఆంటీ బయాటిక్స్ వాడకంపై ప్రభుత్వం, సామాజిక సంస్థలు, ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వాలంటరీ ఆర్గనైజేషన్లు,ఇతర సంస్థలు, ప్రభుత్వంతో భాగస్వామ్యం అయి, గ్రామీణ ప్రాంతాల్లో అతిగా ఆంటీ బయాటిక్స్ వాడడం వల్ల వచ్చే నష్టాలను, వాటితో,మన శరీరంలోనీ, చెడు బాక్టీరియాలతో పాటు,మంచి బాక్టీరియాలను నాశనం చేస్తాయనీ,చెప్పాలి‌.ఇలా ప్రతి ఒక్కరికి,ఆంటీ బయాటిక్స్ గురించి తెలియజేయాలి.
               
కామెంట్‌లు