రాజ భాష - వేద ఘోష ;-ఎం. వి. ఉమాదేవి
రాజభాష హిందీ  రమణీయమయింది 
వేదఘోషలా శాంతినిచ్చే  మహనీయభాష !
సంస్కృతము నుండియేగదా రూపం మారి 
పలుభాషలు  పఠనీయముగా ఉన్నాయి !

విశ్వమందు రెండొభాష గా వెలుగుతుంది 
అధికంగా పలుకుభాష హిందీ అండి !
మేరా భారత్ మహాన్ 
అనియేగా పౌర ఘోషయింది !

కవులు కళాకారులుండె  ఉత్తరాదిలో  
తెలుగువారి ముద్రలుండెకదా..ఆనాడు పీవీ !!
 నేడు ముప్పవరపు వెంకయ్య నాయుడు 
మహామహులు సర్వులున్నారు ఢిల్లీలో !

అలనాటి దూరదర్శన్ టీవి లో  రామాయణము 
ఆదివారము మహా భారతము అందర్నీ 
ఉర్రూత లూగించేవి 
పితాజీకీ మాతాజీకి  గురూజీ కీ  ప్రణామము !!

కామెంట్‌లు