మన గురజాడ (ముత్యలసరాలు)---గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
మన తెలుగు బిడ్డడు గురజాడ
మన ధరిత్రి వెలుగు గురజాడ
మన తెలుగుజాతి  కడుగుజాడ
మన తెలుగురత్నము

మన తెలుగుతల్లి పూలదండ
మన తెలుగోరికి నండదండ
మన తెలుగోళ్ళ బంగరుకొండ
మన తెలుగు పంతులు

వ్రాసె ముత్యాలసరములను
వ్రాసె పుత్తడిబొమ్మ గేయం 
వ్రాసె కన్యాశుల్క డ్రామా
వ్రాసె జనబాషన

చెప్పె దేశమును ప్రేమించని 
చెప్పె మంచిని పెంచమనుచున్
చెప్పె దేశము మట్టికాదని
చెప్పె పలునీతులు

అనె పొరుగోళ్ళకు  తోద్పడమని
అనె పదాలతొ ప్రశ్నవేయని
అనె స్వలాభములను కుదించని
అనె శుభాల్చేయని


కామెంట్‌లు