పద్యం ; సత్యవాణి

 మూర్తి యేది యైన మోహన రూపమే
గుణముగూడ నట్లె గొప్పదౌను
దొరగ నేలు జగము దొడ్డగా నార్తితో
వేంకటేశవిభుడు వేదమూర్తి

కామెంట్‌లు