గడ్డి పువ్వు!!-- ప్రతాప్ కౌటిళ్యా
పర్వతం
పాదాల దగ్గర
ఒక గడ్డి పువ్వు పూసింది!!

పచ్చని
మహారణ్యంలో
పూయాలని దాని ఆశ!!!

రంగురంగుల
పూదోట లో
విరియాలని ఆశ !!?

ఆకాశమంతా
ఎత్తు ఎదగాలని
దాని ఆశ!!?

దాని ఆయుషు ఒక్కరోజు మాత్రమే!!?

ఆరోజు రానే వచ్చింది!!
గడ్డిపువ్వు ప్రాణం విడిచింది!!?

సుడిగాలి ఒకటి
పర్వతం పైకి వీచింది!!?

గడ్డిపువ్వు ఇప్పుడు
మహా పర్వతం పై మొలిచింది !!!

ప్రపంచమంతా దానికి
కనిపించింది!!
గడ్డి పువ్వును చూసి
ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది !!?

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273

కామెంట్‌లు