హైకూలు;- సుమ కైకాల
స్వేచ్ఛాoశం

1. అనురాగమై
    అండగా నిలుస్తుంది 
    స్నేహబంధము!...

2. అత్మీయతకు
    సరైన చిరునామా
    తోబుట్టువులే!...

3. ప్రతీ అక్షరం
    తేనెలొలుకుతుంది
    తెలుగు భాష!...

4.  ప్రతి మలుపు
     గెలుపు ఓటములు
     జీవితమంతే!...

5.  కోటి కాంతులు
     విరజిమ్ముతున్నాయి
     పాపాయి నవ్వు!...

కామెంట్‌లు