సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అజ్ఞ... ఆజ్ఞ
******
ఆచి తూచి వేసే అజ్ఞ లోనే  మన యుక్తి, వివేకం విజ్ఞత కనిపిస్తుంది.
వేసే అజ్ఞ అపమార్గంలో పడితే,ఆ తర్వాత ఎంత బాధ పడినా అనుకున్నది పొందలేని, సాధించలేని పరిస్థితులు ఎదురవ్వొచ్చు.
అజ్ఞ అంటే ఏమిటో చూద్దాం.. అజ్ఞ అంటే పాదము,అంఘ్రి,అంజ, చరణము,అధమాంగము, పదము,హజ్ఞ మొదలైన అర్థాలు ఉన్నాయి.
"శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ఠదు అంటారు" కానీ మనం వేసే అజ్ఞ మాత్రం మన అంతరంగపు ఆజ్ఞలోనే ఉండాలి.
కోతి లాంటి మనసు ఆజ్ఞలో నడిస్తే  కష్టాలను, నష్టాలను కోరితెచ్చుకున్నట్టే అవుతుంది.
ప్రతి మనిషికి ఆత్మ అంటూ ఒకటి ఉంటుంది.ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలో కూడదో వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో తెలుపుతూ హెచ్చరిస్తుంది.
కాబట్టి  మనం మనసు ఆజ్ఞలో కాకుండా ఆత్మ లేదా అంతరంగం ఆనతి, శాసనం మేరకు నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
అలాగే మంచి పనులు చేసేటప్పుడు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో వేసే అజ్జ  హితైషులైన మన కుటుంబ పెద్దల,ఆత్మీయుల సలహాలను సూచనలను తీసుకుని వారి అనుమతి, దిశా నిర్దేశములో వేస్తే, పనుల్లో మంచి ఫలితాలు పొందగలం.కామెంట్‌లు