అంతిమ విజయం నాదే!(కవిత );-కొత్తపల్లి ఉదయబాబుసికింద్రాబాద్
అతను మొలకెత్తడానికి
నేల అవసరం లేదు
అంటు కట్టక్కర్లేదు
చెమటచుక్కనుంచి
ఉద్భవించిన రాక్షసుడిలా
కనులు తెరుచుకోకముందే
ఒక అస్పష్ట రూపంగా...
అణువుకు మరో అణువు తోడవుతూ
ఒక మహా అణువుగా...
చివరాఖరికి తన విశ్వరూపంతో...
అతను నాకు అనునిత్యపు 'సమస్య'.
అప్పుడు మొదలతుంది నా అంతర్మధనం
ప్రతీ ఉదయం లాగానే నాలో
రణరంగం క్షేత్రం సంసిద్దమవుతుంది.
నా సహజ ఆయుధ  సంపదతో
నైపుణ్య అస్త్ర శస్త్రాలతో
బ్రతుకుపోరాటంలో అనునిత్యపు
'సమస్య'పరిష్కారపు ఫలితం కోసం
సైనికుడనై సమాయత్తమవుతాను...
అంతిమ విజయం సాధిస్తాను!!!

కామెంట్‌లు