లలితగీతం :- (యుగళం) కోరాడ నరసింహారావు... !
ఆమె :-
       సిట్టి సిలకట్టు గట్టి... 
 తలకేమో గుడ్డ  సుట్టి... ఆ 
  మునకాలకర్రను అట్టా - ఇట్టా  ఊపుకుంటు... 
  పొలంగట్టుమీద నువ్వు... 
   నడిసొస్తుంటే మావా.... !
   నాలో  కోరికెంతో  పెరుగు తుంది మావా... !!
ఆగడ్డికుప్ప పక్కకి ఎల దామా. 

అతడు :-
   జెర్రిపోతులాటి జెడలో... 

   పూలగుబ్బనే ఎట్టి... 
  అందమైన జాకెట్టుతో, 
    ఆకు పచ్చ సీర గట్టి..., 
  బొట్టు పెట్టి,  కాటుకెట్టి... 
  ముస్తాబై  మెరిసిపోతు 
  నన్నిటా పట్టుకుంటే... 
  నిన్నిడిసి పోగలనా  చామంతీ 
నువ్ సైఅంటే...కాదదoటాన     నా బంతి... !!
 
ఇద్దరూ :-
   తెల్ల వార్లూ మన  మిక  నిద్దురె  పోకూడదు ! 
ఈ రాతిరి మన   కెపుడూ మరుపే రాకూడదు...!!
 ఆ మబ్బులమాటుకి నువ్వు 
   ఎల్ల వయ్య సందమామ !
 మా అల్లరి పనులు సూస్తే... 
  తార ఎంట పరిగెడతావ్.. !!
హ..హ్హ..హ్హ...హ్హ... హ్హా.... !
      *******
కామెంట్‌లు