రాజంటే?! అచ్యుతుని రాజ్యశ్రీ

కాశ్మీర్ రాజ్యాన్ని మేఘవాహనుడు పరిపాలిస్తున్నాడు.ధర్మం కి ప్రతీక రాజు. దిగ్విజయయాత్రకి బైలుదేరాడు.సైన్యం అడవిలో మకాం వేసింది. ఆప్రకృతి అందాల్ని చూస్తూ రాజు ముందుకి ఒక్క డే సాగాడు.దూరం గా  గుండె లవిసేలా ఏడ్పువినిపించింది."నన్ను కాపాడండీ!" ఓపిల్లాడి ఆర్తనాదాలు!రాజు ఆవైపు అడుగులేశాడు.ఓ వేటగాడు ఒక కుర్రాడిని బలిఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.చెట్టుకి కట్టేసిన ఆకుర్రాడు ఆర్తనాదాలు హాహాకారాలు చూస్తూ ఒక్క అంగలో రాజు అక్కడకి చేరి వేటగాడిని హఠాత్తుగా  తన చేతుల్తో బంధించాడు." నా రాజ్యం లో  నరబలి ఇవ్వకూడదు అని నీకు తెలీదా?"" బలి ఇయ్యకుంటే నాపిలగాడు చస్తడు.కొండదేవత కల్లో సెప్పినాది.ఆపిలగాడికి ఎవరూ లేరు. నాకాడనే ఉంటున్నాడు.బలి ఈయకుంటే మా అందరినీ సంపేత్తాది మాకుల దేవత!"" అనాధ అని పిల్లాడిని చంపుతావా? నన్ను బలి ఇవ్వు. రాజు  ని ఇస్తే మంచిది. మంచి వస్తువులే నైవేద్యం పెట్టాలి" అని రాజు వాడితో అనగానే వేటగాడు వలవల ఏడుస్తూ "పెబూ! మాఅందరికీ తండ్రివి.మీరు లేకుంటే దేశానికి దిక్కు లేదు. " అన్నాడు. కానీ రాజు స్వయంగా తన తల పై కత్తిని పెట్టుకున్నాడు.ఓవింతకాంతి లో దివ్యపురుషుడు ప్రత్యక్షమై" నీవు నా అగ్ని పరీక్ష లో నెగ్గావు.నీకీర్తి అజరామరం" అంటూండగా వేటగాడు బాలుడు మాయమైనారు.ఒకప్పుడు రాజుల పాలన త్యాగం పరహితం కోసమే ఉండేది. ఇలాంటి కథలు మన పురాణాలలో ఎన్నో 🌹 
కామెంట్‌లు