చిగురు పచ్చ చిలకమ్మ(బాల గేయము);-ఎడ్ల లక్ష్మి
చిట్టి పొట్టి చిలకమ్మా
చెట్టుమీద చేరింది 
చిగురు పచ్చ రంగుతో
రెమ్మల చాటుకు దాగింది !!

కిలకిలమని పలికింది
వేటగాడు వచ్చాడు
చెట్టు క్రింద చేరాడు
కిలకిల పలుకులిన్నాడు !!

చెట్టు పైకి చూశాడు
ఎర్రని పండ్లు మెరిశాయి
చిలుక ముక్కని భ్రమిశాడు
బాణము గురిపెట్టి కొట్టాడు !!

కొమ్మకు బాణం తాకింది
గట్టిగా చప్పుడు వచ్చింది
చప్పుడు విని చిలకమ్మా
బీర బీర లేచి పోయింది !!

పోయే చిలుకను చూసిండు
బిక్క మొహం పెట్టిండు
దిక్కుతోచక వేటగాడు
ఇంటి దారి పట్టిండు !!


కామెంట్‌లు