సుప్రభాత కవిత ; బృంద
రెప్పల దుప్పటి తీయకనే
వెచ్చని వేకువ తాకింది

మంచుతెరలు తొలగించి
మమతలెన్నో  తెలిపింది

కలలు పారిజాతాలై
పరిమళాలు  నింపింది

ఆకసాన పొడిచిన పొద్దు
మనసునంత వెలిగించింది

ఆకుచివరి ముత్యాలకు
సప్త వర్ణాలు పొదిగింది

ముకుళించిన మనసేమో
మందారమై విరిసింది

ముసినవ్వుల మిసమిసల
సుమబాలల సంతోషం

ఎదనిండా నింపుకుని
ఎదురుచూసే కనులకు

ఎదురైన వసంతంలా
కళ్ళముందు నిలబడిన

కమ్మని ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు