రాత్రి వ్యవసాయం! అచ్యుతుని రాజ్యశ్రీ

 కుంతల రాజు దర్బార్ లోకి ఓవ్యాపారి వచ్చాడు."ప్రభూ!ఈనాపెట్టె లో మీకొక అద్భుత బహుమతి తెచ్చాను.అది మీదర్బారులోవారు ఊహించి చెప్పాలి."కానీ సమయం గడుస్తున్నా ఎవరూ పెదవి కదపలేదు.ఆస్థాన విదూషకుడు అన్నాడు "మీరు ఏంవ్యాపారం చేస్తారు?"  "నేను అపురూప వస్తువులు తయారు చేసి అమ్ముతాను.విత్తనం నీరు లేకుండా మొక్కలు మొలిపిస్తాను.రంగుల పూలతో కనువిందు చేసే మొక్కలు!" విదూషకుడు రాజు  అనుమతి తో ఇలా అన్నాడు "వ్యాపారి గారూ!ఈరాత్రి మీరు మాఇంట అతిధి గా ఉండండి." రాజు అందులో ఏదో మతలబు ఉంది అని గ్రహించాడు.రాత్రి సుష్టుగా భోజనం చేశాక వ్యాపారి విదూషకుడు కబుర్లలో పడ్డారు. "ఇంతకుముందు వచ్చిన  వ్యాపారి  మాఇంట్లో నే బస చేశాడు.మట్టి నీరు విత్తనం లేకుండా చెట్టుకి రకరకాలకాయలు కాయించాడు.చేతిలో పెట్టగానే తీయని పళ్ళు గా మారటం ఓఅద్భుతం.మీరు ఈరాత్రి కే మొక్కలు మొలిపించగలరా?" వ్యాపారి గర్వంగా అన్నాడు "అయ్యా!నామొక్కలకి వేళ్ళుండవు కానీ రంగుల పూలు కనువిందు చేస్తాయి.ఈపెట్టెలో ఉన్నాయి." ఆమర్నాడు రాజసభలో విదూషకుడు అన్నాడు "ప్రభూ! ఆపెట్టెలో కేవలం నిప్పు పొగ మాత్రమే ఉన్నాయి.వాటితో పూలు పూయిస్తాడు". పెట్టె తెరిపించాడు.అందులో ఏమున్నాయో తెలుసా?పువ్వొత్తులు చిచ్చుబుడ్లు మతాబులు మొదలైన టపాసులు!!"ఎలా తెలుసుకున్నారు మీరు?" రాజు ప్రశ్నకు "ఆఏముంది? రంగుల వెలుగులు చిమ్మేవి టపాసులే కదా? విత్తనం లేని మొక్కలు పూలు పూయటం అంటే అవి వెలిగితే రాలే కాంతి పూలు!" అంతే సభంతా హర్షధ్వానాలతో విదూషకునికి జేజేలు పలికింది 🌹
కామెంట్‌లు