* శుభాకాంక్షలు * @-- కోరాడ నరసింహా రావు !
 తండ్రి లేకున్నా.... ఆ తండ్రి 
          బాధ్యతా రహితుడై..       స్థిరుడు కాకున్నా... 
    ఆ ఇంటి బరువు- బాధ్యత లతో మొదలౌతుంది ఆ ఇంటి మగ బిడ్డ జీవితం..... !
ఆ జీవితానికింక సుఖానందసౌ ఖ్యాలెక్కడ.... !?
అందరిలా స్వేచ్ఛగా ఆట, పాట లుండవ్... !
.. చదువు  సంధ్య లుండవ్ !
ఇంటి పరువు,మర్యాదలు  కాపాడుతూ... అమ్మకు, తోడ బుట్టిన వారికీ అండగా జీవితా న్ని అంకితం చేసినవారికే... 
 ఈ ప్రపంచపురుషులదినోత్సవ
శుభాకాంక్షలు.... ! 
 అన్నగా...అక్కా,చెల్లెళ్ళముద్దు
ముచ్చట్లు తీరుస్తూ...., 
 బాధ్యతగా పెళ్లిళ్లు చేసి... 
   కడ దాకా వారి బాగోగులను చూస్తూ...మంచిసోదరుడుఅని 
పించుకున్న మగవారికే.... 
...  ఈ పురుషుల  దినోత్సవ శుభాకాంక్షలు... !
వేసిన మూడుముళ్లతో వెంట నడచి కష్ట, సుఖాలలో చెరిసగ మైన  అర్ధాంగికి కంటతడిపెట్టిం చక  ప్రేమాభిమాన గౌరవాలతో  చూసుకున్న నిజ పురుషులకే ఈ దినోత్సవ శుభాకాంక్షలు...!
ఇంటి యజమానిగా... భార్యా బిడ్డలను కంటికిరెప్పలా కాచు కుంటూ... పిల్లలను ప్రయోజకు లను  చెయ్యటానికై నిరంతరం పాటుపడే మగమహారాజులకే ఈ ప్రపంచపురుషులదినోత్సవ 
శుభాకాంక్షలు.... !
సత్ప్రవర్తనతో ఇంటా బయటా
మన్ననలందుతూ.... ధర్మాన్ని తప్పక దేశాన్ని ప్రేమించేపురుష 
పుంగవులందరికీ... 
  నా ఈ హార్దిక ప్రపంచ పురుషు ల దినోత్సవ శుభాకాంక్షలు ! 
ఇట్టి వారి వలనే కదా.... 
 చక్కని కుటుంబాలు విలసిల్లేది
వీరిమూలముననే కదా... 
 మానవసమాజాలు వికసించేది
ఉత్తమ పురుషులారా... 
     వర్ధిల్లండి !
 ఆనందమయమానవసమాజా న్ని నిర్మించండి... 

కామెంట్‌లు