వచనకవితల ఆంధ్రాభోజనానికి స్వాగతం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రోజూ
వచనకవితలను వండుతున్నా
విందుకుపిలిచి షడ్రుచులను
వడ్డిస్తున్నా

రోజూ
కలానికి పనిపెడుతున్నా
కమ్మని కవితలను
కూర్పిస్తున్నా

రోజూ
చక్షువులకు చక్కదనాలుచూపిస్తున్నా
చూచిన దృశ్యాలను
చక్కగా వర్ణించమంటున్నా

రోజూ
అంతరంగాన్ని ఆలోచించమంటున్నా
అందరికి ఆనందమును
అందించమంటున్నా

రోజూ
చేతిని ఆధీనంలోకితీసుకుంటున్నా
చక్కని కవనాలను
చేబట్టిస్తున్నా

రోజూ
పాఠకులను  చదివిస్తున్నా
పెక్కు భావనలను
పంచిపెదుతున్నా

రోజూ
అక్షరాలను అల్లుతున్నా
అందరికి ముత్యాలసరాలను
అందిస్తున్నా

రోజూ
పలుకవితలను కూరిపిస్తున్నా
ప్రాసలతో పదాలాను
పారిస్తున్నా

రోజూ
కవితాపఠనం చేస్తున్నా
కడుశ్రావ్యతతో ప్రేక్షకులను 
కుతూహలపరుస్తున్నా

రోజూ
కవనసేద్యం చేస్తున్నా
కవితా కుసుమాలను
కవితాభిమానులకు పంపుతున్నా

రోజూ
సాహితీపవనాలను విసరుతున్నా
సుమ సౌరభాలను
చల్లుతున్నా

విందుకు రండి
తినండి చదవండి
తృప్తిని పొందండి
కవిని గుర్తించుకోండి


కామెంట్‌లు